×
Ad

Akhanda Title Song : ‘అఖండ’ టైటిల్ సాంగ్ వచ్చేసింది..

‘అఖండ’ గా బాలయ్య నట విశ్వరూపాన్ని చూపిస్తూ.. అఘోరా క్యారెక్టర్‌ని ఎలివేట్ చేసే ఈ సాంగ్ లిరికల్‌గానే కాకుండా విజువల్‌గానూ ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది..

  • Published On : January 15, 2022 / 12:36 PM IST

Akhanda Title Song

Akhanda Title Song: ‘అఖండ’.. ‘సింహా’, ‘లెజెండ్’ వంటి భారీ బ్లాక్‌బస్టర్స్ తర్వాత నటసింహా నందమూరి బాలకృష్ణ, ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుల క్రేజీ కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ.. గత ఏడు వారాలుగా బాక్సాఫీస్ బరిలో సత్తా చాటుతూ విజయవంతంగా 50 రోజులవైపు పరుగులు తీస్తుంది.

Akhanda Mass Jathara : ఆరో వారంలోనూ అన్‌స్టాపబుల్..

సంక్రాంతి కానుకగా ‘అఖండ’ టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు. ‘అఖండ’ గా బాలయ్య నట విశ్వరూపాన్ని చూపిస్తూ.. అఘోరా క్యారెక్టర్‌ని ఎలివేట్ చేసే ఈ సాంగ్ లిరికల్‌గానే కాకుండా విజువల్‌గానూ ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ట్యూన్ కంపోజ్ చెయ్యగా.. శంకర్ మహదేవన్, సిద్దార్థ్ మహదేవన్, శివం మహదేవన్ ఈ శ్లోకాన్ని అద్భుతంగా పాడారు.

Unstoppable with NBK : బాలయ్య దెబ్బకి ‘థింకింగ్’ మారిపోతుందని ముందే చెప్పాం-‘ఆహా’ టీం

మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్ పతాకంపై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ‘అఖండ’ సెకండ్ వేవ్ తర్వాత సెన్సేషన్ క్రియేట్ చెయ్యడమే కాకుండా విడుదలైన ప్రతి సెంటర్లోనూ బాలయ్య కెరీర్‌లో హయ్యస్ట్ కలెక్షన్లు రాబట్టి, త్వరలో 50 రోజులు పూర్తి చేసుకోబోతుంది.