AAA.. అఖిల్, అల్లు అర్జున్, అకిరా నందన్.. ముగ్గురి బర్త్ డేలు ఇవాళే..

అల్లు అర్జున్, అఖిల్, అకిరా నందన్.. ఈ ముగ్గురి పుట్టిన రోజులు ఇవాళే.

  • Published On : April 8, 2026 / 09:15 AM IST

AAA - Akhil Akkineni Allu Arjun Akira Nandan

AAA Birthday: పలువురు సెలబ్రిటీల బర్త్ డేలు ఒకే రోజు వస్తుంటాయి. అలా నేడు ఏప్రిల్ 8న కూడా చాలా మంది సెలబ్రిటీల పుట్టిన రోజులు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అఖిల్, అకిరా నందన్.. ఈ ముగ్గురి పుట్టిన రోజులు ఇవాళే.

పుష్ప 2 సినిమాతో పాన్ ఇండియా స్టార్ డమ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో భారీ సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత కూడా భారీ లైనప్ పెట్టుకున్నాడు. నేడు ఐకాన్ స్టార్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు, పలువురు ప్రముఖులు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

Also Read : జోనిత.. అందాల ఆరబోత.. డెకాయిట్ ఈవెంట్లో సింగర్ జోనిత గాంధీ మెరుపులు..

ఇక కింగ్ నాగార్జున కొడుకుగా సినీ పరిశ్రమకు పరిచయమైన అఖిల్ అక్కినేని పుట్టిన రోజు కూడా ఇవాళే. అఖిల్ మంచి హిట్ కోసం ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్నాడు. చేసిన సినిమాలన్నీ యావరేజ్, లేదా ఫ్లాప్స్ గానే మిగిలాయి. త్వరలో లెనిన్ సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా అయినా అఖిల్ కి హిట్ ఇస్తుందా చూడాలి.

పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ పుట్టిన రోజు కూడా ఇవాళే. ఇప్పటికే పవర్ స్టార్ కొడుకుగా ఫేమ్ తెచ్చుకున్నాడు. అకిరా హీరోగా ఎంట్రీ ఇవ్వాలని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. కానీ అకిరా హీరోగా సినిమాల్లోకి రాడు అని రేణు దేశాయ్ క్లారిటీ ఇచ్చింది. అకిరా మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడని తెలుస్తుంది. ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ గా షార్ట్ ఫిలిమ్స్ కి వర్క్ చేసాడు. OG సినిమాకు థమన్ టీమ్ లో పని చేసాడు. అమెరికా వెళ్లి మ్యూజిక్ కోర్సులు కూడా నేర్చుకున్నాడు. దీంతో అకిరా మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడని తెలుస్తుంది.

Also Read : అకిరా నందన్ బర్త్ డే.. తండ్రి పవన్ కళ్యాణ్ తో స్పెషల్ ఫోటోలు..

ఈ ముగ్గురితో పాటే పాటల రచయిత అనంత్ శ్రీరామ్, హీరోయిన్ నిత్య మీనన్ పుట్టిన రోజు కూడా ఇవాళే కావడం గమనార్హం.