Lenin Collection Day 1 : లెనిన్ తొలి రోజు క‌లెక్ష‌న్ ఎంతంటే? అఖిల్ గ‌ట్టిగానే కొట్టాడు భ‌య్యా..

అఖిల్ అక్కినేని న‌టించిన లెనిన్ చిత్రం తొలి రోజు క‌లెక్ష‌న్ (Lenin Collection) వివ‌రాల‌ను చిత్ర బృందం వెల్ల‌డించింది.

Akhil Akkineni Lenin first day collection

Lenin Collection Day 1: అక్కినేని అఖిల్ న‌టించిన తాజా చిత్రం లెనిన్‌. మురళీ కిషోర్ అబ్బూరు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో భాగ్య‌శ్రీ బోర్సే క‌థానాయిక‌. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీలు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం నిన్న (జూలై 10) ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇక మొద‌టి రోజు ఈ చిత్రం 16.7 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించింది.ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ చిత్ర బృందం ఓ స్పెష‌ల్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. కాగా.. అఖిల్ కెరీర్‌లో తొలి రోజు అత్య‌ధిక క‌లెక్ష‌న్లు ఇవే. ఈ నేప‌థ్యంలో ఆయ‌న అభిమానులు పండ‌గ చేసుకుంటున్నారు.

Also Read : కంచి కామాక్షి టెంపుల్‌లో యాంక‌ర్ వ‌ర్షిణి.. ఆధ్యాత్మిక పర్యటన ఫోటోలు వైరల్

అఖిల్, భాగ‌శ్రీ బోర్సే న‌ట‌న‌కు ప్రేక్ష‌కులు ఫిదా అవుతున్నారు. ఇక నేడు శ‌నివారం, రేపు ఆదివారం కావ‌డంతో ఈ చిత్ర క‌లెక్ష‌న్లు భారీగా పెరిగే అవ‌కాశం ఉంద‌ని సినీ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.