Lenin Twitter Review : ‘లెనిన్’ ట్విట్ట‌ర్ రివ్యూ.. అక్కినేని అఖిల్ ఊర మాస్ పర్ఫార్మెన్స్..!

అక్కినేని అఖిల్ న‌టించిన లెనిన్ మూవీని వీక్షించిన ప్రేక్ష‌కులు సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌మ అభిప్రాయాల‌ను (Lenin Twitter Review) తెలియ‌జేస్తున్నారు.

Akhil Akkineni Lenin Movie Twitter Review

Lenin Movie Twitter Review : దాదాపు మూడేళ్ల గ్యాప్ త‌రువాత అక్కినేని అఖిల్ న‌టించిన మూవీ లెనిన్‌. మురళీ కిషోర్ అబ్బూరు ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కింది. భాగ్య శ్రీ బోర్సే క‌థానాయిక‌. లవ్ అండ్ ఎమోషనల్ రూరల్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ మూవీలో శివాజీ, రాజీవ్ కనకాల, బ్రహ్మాజీ, సునీల్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్స్ పై నాగార్జున, నాగవంశీ లు ఈ చిత్రాన్ని నిర్మించారు. నేడు (జూలై 10) ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

ఇప్ప‌టికే చాలా చోట్ల షోలు ప‌డ్డాయి. ఈ చిత్రాన్ని వీక్షించిన అభిమానులు సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌మ అభిప్రాయాల‌ను తెలియ‌జేస్తున్నారు. ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వ‌స్తోంది. ముఖ్యంగా అఖిల్ పర్ఫార్మెన్స్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. అఖిల్ యాక్టింగ్‌లో ఇరగదీశాడంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read –  పెళ్లై ఇద్ద‌రు పిల్ల‌లున్న హీరోయిన్‌.. అయినా అందాల‌తో అద‌ర‌గొడుతున్న ప్ర‌ణీత

అఖిల్, భాగ్య శ్రీ బోర్సే కెమిస్ట్రీ బాగుంద‌ని, ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ సన్నివేశాలు సినిమాకు హైలెట్ అని అంటున్నారు. ఇక ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ సినిమాకు మరో హైలెట్ అయింద‌ని చెబుతున్నారు. ఈ చిత్రం అఖిల్ కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచిపోతుంద‌ని అంటున్నారు.