Akhil Akkineni : అసలే హీరోగా సక్సెస్ లేదు.. ఇప్పుడు గెస్ట్ రోల్స్ అవసరమా?
తాజాగా అఖిల్ గురించి ఆసక్తికర అప్డేట్ వినిపిస్తుంది. (Akhil Akkineni)
- Saketh U
- Published On : February 26, 2026 / 08:55 AM IST
Akhil Akkineni
Akhil Akkineni : అక్కినేని వారసుడిగా అఖిల్ గ్రాండ్ గా లాంచ్ అయ్యాడు. మొదటి సినిమానే ఫ్లాప్ అయింది. ఆ తర్వాత ఇప్పటివరకు కమర్షియల్ గా భారీ సక్సెస్ ఒక్కటి కూడా కొట్టలేదు అఖిల్. అక్కినేని ఫ్యాన్స్ కూడా ఈ విషయంలో తీవ్ర నిరాశలో ఉన్నారు. హలో, మిసర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలు యావరేజ్ గానే నిలిచాయి. ఇవేవి కమర్షియల్ సక్సెస్ అవ్వలేదు.
అఖిల్ ఎప్పుడు హిట్ కొడతాడా అని అక్కినేని ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్, ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. త్వరలో లెనిన్ సినిమాతో రాబోతున్నాడు అఖిల్. ఇప్పటివరకు రిలీజ్ చేసిన గ్లింప్స్, టీజర్ తో కూడా ఈ సినిమాపై కనీసం బజ్ లేదు. దీంతో ఈ సినిమాపై కూడా సందేహాలు వస్తున్నాయి. అయితే తాజాగా అఖిల్ గురించి ఆసక్తికర అప్డేట్ వినిపిస్తుంది.
అఖిల్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నాడని టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది. క్లైమాక్స్ లో వచ్చే ఓ సీన్ లో అఖిల్ గెస్ట్ రోల్ చేస్తాడని తెలుస్తుంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి క్లారిటీ లేదు.
ఒకవేళ ఇది నిజం అయితే కనక అఖిల్ ఇప్పుడు గెస్ట్ రోల్స్ చేయడం అవసరమా అని అడుగుతున్నారు. మంచి కథ ఎంచుకొని హిట్ కొట్టే ప్లాన్ చేసుకుంటే బెటర్ అని, ఒక సినిమా అఖిల్ గెస్ట్ రోల్ చేసాడంటే తర్వాత చాలా మంది అలాంటి గెస్ట్ రోల్స్ చేయమని అడుగుతారని భావిస్తున్నారు. ఇది అయితే జరగకూడదు అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : Rajamouli : ఇక హాలీవుడ్ కి వెళ్ళక్కర్లేదు.. ‘వారణాసి’ ఇక్కడే నాగార్జున స్టూడియోలో షూట్.. రాజమౌళి కామెంట్స్..
