Akhil Sarthak : గత బిగ్ బాస్ సీజన్ లో బాగా పాపులారిటీ సంపాదించిన కంటెస్టెంట్స్ లో అఖిల్ సార్థక్ ఒకరు. బిగ్ బాస్ 4 రన్నరప్ గా నిలిచి జనాల్లో క్రేజ్ బాగా సంపాదించాడు. మోనాల్‌తో లవ్ ట్రాక్, సోహైల్‌తో ఫ్రెండ్షిప్ అఖిల్ కి బాగా కలిసొచ్చింది. బయటకి వచ్చాక కూడా ఆ క్రేజ్ ని నిలబెట్టుకోగలిగాడు. బిగ్ బాస్ క్రేజ్ తో సినిమాలు, వెబ్ సిరీస్ లాంటి కొన్ని ఆఫర్స్ ని కూడా సంపాదించాడు. బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చాక తాను సొంత కార్ కొనుక్కున్నాడు.
Mahesh Babu : త్వరలో కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల పాఠశాలకు వస్తాను : మహేష్ బాబు
తాజాగా తన తండికి కార్ కొనిచ్చాడు అఖిల్ సార్థక్. అఖిల్ తండ్రి బర్త్ డే సందర్భంగా కార్ ని గిఫ్ట్ గా ఇచ్చాడు. దీని పై ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ తండ్రికి విషెస్ చెప్పాడు అఖిల్. హ్యాపీ బర్త్‌డే డాడ్, ఒక రక్షకుడిలా ఎప్పుడూ నా వెంటే ఉన్నావు. మీరే నా సూపర్ హీరో, మీ వల్లే నేనీ స్థానంలో ఉన్నాను. మీరు నమ్ముతారో లేదో కానీ మీ కోసం ఓ కారు కొన్నాను. చిన్నప్పుడు మీరు నాకు సైకిల్ సర్ప్రైజ్ గిఫ్ట్‌గా ఇచ్చారు, నాకోసం చాలా చేశారు. ఇందుకు మీకెన్ని కృతజ్ఞతలు చెప్పినా సరిపోవు. నా నుంచి మీకు చిన్న గిఫ్ట్ పప్పా. మీరు చేసినవన్నీ నేను మీకు తిరిగి చేయలేకపోవచ్చు, కానీ మిమ్మల్ని సంతోషంగా ఉండేలా చేస్తాను. మీరు గర్వపడే పనులు చేస్తాను అని పోస్ట్ చేశాడు.
Bigg Boss 5 : బిగ్ బాస్ హోటల్.. పీక్స్ లో కంటెస్టెంట్స్ పర్ఫార్మెన్స్
మీకు కారు గిఫ్ట్ ఇవ్వాలన్నది నా కల. అది నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సర్ప్రైజ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మిమ్మల్ని ఎప్పుడూ తలెత్తుకుని తిరిగేలా చేస్తానని మాటిస్తున్నాను అంటూ ఓ ఎమోషనల్ పోస్ట్ ని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసాడు అఖిల్. ఈ పోస్ట్ చూసి అఖిల్ ఫ్యాన్స్ అభినందిస్తూ కామెట్స్ చేస్తున్నారు.