Sisindri 2 : ‘సిసింద్రీ 2’ అనౌన్స్ చేసిన అఖిల్.. ఎవరితోనో తెలుసా?
లెనిన్ సినిమాతో హిట్ కొట్టిన అఖిల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో సిసింద్రీ పార్ట్ 2 పై ఆసక్తికర కామెంట్స్ చేసారు. (Sisindri 2)
- Saketh U
- Published on- July 26, 2026 / 10:01 AM IST
Sisindri 2
Sisindri 2 : అఖిల్ హీరో అయ్యాక లెనిన్ తో మొదటి హిట్ కొట్టాడని అంతా అంటున్నారు. కానీ అసలు ఊహ తెలియకముందే సిసింద్రీ సినిమాతో పెద్ద హిట్ కొట్టాడు అఖిల్. తన సినిమాలతో ప్రయోగాలు చేసే నాగార్జున తన కొడుకుతో కూడా ఏడాది సంవత్సరం ఉన్నప్పుడే ప్రయోగం చేసి సిసింద్రీ అనే సినిమాని తీశారు. ఓ హాలీవుడ్ సినిమా రీమేక్ గా నాగార్జున నిర్మాణంలో శివ నాగేశ్వరరావు దర్శకత్వంలో అఖిల్ ని మెయిన్ లీడ్ గా పెట్టి నాగార్జున, ఆమని.. పలువురు ముఖ్య పాత్రల్లో 1995 లో వచ్చిన సిసింద్రీ సినిమా అప్పట్లో అందర్నీ మెప్పించి హిట్ కొట్టింది. ఇప్పటికి సిసింద్రీ సినిమా చూసి హాయిగా నవ్వుకోవచ్చు. పిల్లలకు చూపించొచ్చు.
ఇటీవల లెనిన్ సినిమాతో హిట్ కొట్టిన అఖిల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో సిసింద్రీ పార్ట్ 2 పై ఆసక్తికర కామెంట్స్ చేసారు. అలాగే తన సిసింద్రీ అనుభవాలను పంచుకున్నారు.
Also Read : Purushaha : రెండు ఓటీటీల్లోకి వచ్చిన ‘పురుషః’ సినిమా.. భార్యాభర్తలు ఈ సినిమా చూడాల్సిందే..
అఖిల్ సిసింద్రీ పార్ట్ 2 పై మాట్లాడుతూ.. సిసింద్రీ సినిమా నాకు చాలా స్పెషల్. నాకు కొడుకు పుడితే సిసింద్రీ 2 చేయాలి అనుకుంటున్నాను. ఈ విషయం ఆల్రెడీ జైనబ్(అఖిల్ భార్య)కు చెప్పాను. తను కూడా ఓకే అంది. నాకు చిన్నప్పుడే వచ్చిన ఆ గుర్తింపును తర్వాత జనరేషన్ కి కూడా ఇవ్వాలనుకుంటున్నాను అని తెలిపారు. దీంతో సిసింద్రీ పార్ట్ 2 అయితే కంఫర్మ్ అని చెప్పొచ్చు. అఖిల్ కి కొడుకు పుట్టడమే లేట్.
ఇక సిసింద్రీ అనుభవాల గురించి చెప్తూ.. ఆ సినిమాకు రోజంతా కాల్షీట్స్ తీసుకున్నారు. నేను పదిగంటలు పడుకుంటే నాలుగు గంటలు లేచి ఉంటా. నేను నిద్ర లేచినప్పుడు సినిమా షూటింగ్ చేసేవాళ్ళు. నన్ను నవ్వించాలి అంటే కెమెరా వెనక్కి నాన్న వెళ్లి నవ్వించేవాళ్ళు. నేను ఏడవాలంటే మా అమ్మ నా ముందు కార్ ఎక్కి బాయ్ చెప్పి వెళ్లిపోయేది. చాలా సీన్స్ లో ఆమని గారి ఫేస్ కనిపించకుండా మా అమ్మని పెట్టి కూడా షూట్ చేసారు అని అప్పటి సంగతులు పంచుకున్నాడు.
