Purushaha : రెండు ఓటీటీల్లోకి వచ్చిన ‘పురుషః’ సినిమా.. భార్యాభర్తలు ఈ సినిమా చూడాల్సిందే..
ఈ పురుషః సినిమా ఇటీవలే ఓటీటీలోకి వచ్చింది. (Purushaha)
Purushaha
Purushaha : పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజ్ కుమార్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్.. మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన సినిమా ‘పురుషః’. కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బత్తుల సరస్వతి సమర్పణలో బత్తుల కోటేశ్వరరావు నిర్మాణంలో వీరు వులవల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 22న థియేటర్స్ లో రిలీజ్ అయి భార్యాభర్తల గొడవల సన్నివేశాలతో, కామెడీతో నవ్వించింది.
Also Read : Ameer Log : రానా రిలీజ్ చేస్తున్న సినిమా.. అమీర్ లోగ్ రిలీజ్ ఎప్పుడంటే..?
ఈ పురుషః సినిమా ఇటీవలే ఓటీటీలోకి వచ్చింది. ఆహాతో పాటు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ అవుతుంది ఈ సినిమా. స్ట్రీమింగ్ అయిన కొన్ని రోజులకే ‘పురుష:’ రెండు ఓటీటీలలో ట్రెండ్ అవుతోంది. భార్యాభర్తలు కలిసి ఈ సినిమా చూడాల్సిందే. అనుమానించే భార్యలు, అల్లరి చేసే భర్తలతో, భార్యాభర్తల మధ్య గొడవలు, ఎమోషన్ తో సాగే సినిమా పురుషః.

