×
Ad

Nagarjuna: డిజాస్టర్ మూవీ కోసం రూ.1000 కోట్ల సినిమా మిస్.. నాగార్జున సార్ ఏంటి ఇది!

లేటెస్ట్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ దురంధర్ సినిమాను మిస్ చేసుకున్న కింగ్ నాగార్జున(Nagarjuna).

Akkineni Nagarjuna is the first choice for akshay khanna character in Dhurandhar movie.

  • దురంధర్ సినిమా మిస్ చేసుకున్న నాగార్జున
  • అక్షయ్ ఖన్నా పాత్ర కోసం నాగార్జునను అనుకున్న దర్శకుడు
  • కూలీ సినిమా కోసం దురంధర్ సినిమాను రిజెక్ట్ చేసిన నాగ్

Nagarjuna: సినిమా ఇండస్ట్రీలో మంచి అవకాశాలు వచ్చినట్టే వచ్చి మిస్ అవుతూ ఉంటాయి. ఆ సమయంలో బాలేదు అనుకున్న కథ విడుదల తరువాత బ్లాక్ బస్టర్ అవడం చూసి చాలా మంది అవాక్కవుతూ ఉంటారు. అబ్బా, మిస్ అయ్యానే అనే నాలుక కరుచుకుంటూ ఉంటారు. ఇప్పుడు అదే పరిస్థితిలో ఉన్నాడు టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున(Nagarjuna). రీసెంట్ గా వచ్చిన ఒక బ్లాక్ బస్టర్ సినిమాలో నటించే అవకాశాన్ని మిస్ చేసుకున్నాడట ఈ హీరో.

అది కూడా ఒక డిజాస్టర్ సినిమా కోసం. ఇంతకీ అసలు విషయం ఏంటంటే, అక్కినేని నాగార్జున రీసెంట్ గా విలన్ గా చేసిన సినిమా కూలీ. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వచ్చిన ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించాడు. ఈ సినిమాలో సైమన్ అనే క్రూయల్ విలన్ రోల్ చేశాడు నాగార్జున. సినిమాలో ఆయన పాత్రకు చాలా మంది అప్లాజ్ వచ్చింది. కానీ, భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా మాత్రం డిజాస్టర్ అయ్యింది.

Ntr: ‘దండోరా’ శక్తివంతమైన సినిమా.. మూవీ టీంపై ఎన్టీఆర్ ప్రశంసలు

అయితే, కూలీ సినిమా ఒకే చేసిన సమయంలోనే బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ దురంధర్ సినిమాలో నటించే అవకాశం వచ్చిందట నాగార్జున. దురంధర్ సినిమాలో అక్షయ్ ఖన్నా పాత్రను ముందు నాగార్జునకు చెప్పాడట దర్శకుడు ఆదిత్య ధర్. కానీ, ఒకేసారి రెండు విలన్ పాత్రలు చేయడం కాస్త రిక్స్ అనుకున్నాడట నాగార్జున. అలా దురంధర్ సినిమాలో భాగమయ్యే అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు నాగార్జున.

దురంధర్ సినిమాను కాదని చేసిన కూలీ సినిమా భారీ డిజాస్టర్ అయ్యింది. దురంధర్ సినిమా ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ న్యూస్ తెలిసిన నాగార్జున ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవుతున్నారు. దురంధర్ సినిమా చేసి ఉంటే ఆయన క్రేజ్ నెక్స్ట్ లెవల్లోకి వెళ్ళేది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి నాగార్జున తన కెరీర్ లో ఒక బ్లాక్ బస్టర్ సినిమాను మిస్ చేసుకున్నాడు అనే చెప్పాలి.