Ntr: ‘దండోరా’ శక్తివంతమైన సినిమా.. మూవీ టీంపై ఎన్టీఆర్ ప్రశంసలు

దండోరా సినిమాపై ప్రశంసలు కురిపించిన టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్(Ntr).

Ntr: ‘దండోరా’ శక్తివంతమైన సినిమా.. మూవీ టీంపై ఎన్టీఆర్ ప్రశంసలు

NTR praises Dandora movie and team.

Updated On : January 20, 2026 / 7:04 AM IST
  • ‘దండోరా’ సినిమాపై ఎన్టీఆర్ ప్రశంసలు
  • ఇది శక్తివంతమైన కథ అంటూ కామెంట్స్
  • చిత్ర యూనిట్ కు అభినందనలు తెలిపిన ఎన్టీఆర్

Ntr: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటీవల విడుదలైన సినిమా ‘దండోరా’. క్రిస్మస్ సందర్బంగా డిసెంబర్ 25న ఈ సినిమా విడుదుల అయ్యింది. ఆడియన్స్ నుంచి కూడా ఈ సినిమాకు పాజిటీవ్ టాక్ వచ్చింది. కానీ, అదే రోజు మరో మూడు సినిమాకు కూడా విడుదల అవడంతో ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు. కానీ, చాలా మంది ప్రముఖుల నుంచి ఈ సినిమాకు ప్రశంసలు దక్కాయి.

Malavika Mohanan: శారీలో స్టన్నింగ్ లుక్ లో మాళవిక మెరుపులు.. ఫొటోలు

తాజాగా గ్లోబల్ స్టార్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr) కూడా దండోరా సినిమాపై ప్రశంసలు కురిపించాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూ చిత్ర యూనిట్ పై ప్రశంసలు కురిపించాడు. “ఇప్పుడే ‘దండోరా’ సినిమా చూశాను. ఇది ఆలోచింపజేసే, శక్తివంతమైన సినిమా. శివాజీ గారు, నవదీప్, నందు, రవి కృష్ణ, బిందు మాధవి అద్భుతమైన నటనను కనబరిచారు. ఇంతటి బలమైన, రూటెడ్ కథను ఇంత బాగా రూపొందించినందుకు దర్శకుడు మురళీ కాంత్ గారికి నా అభినందనలు.

ఈ ప్రయత్నానికి మద్దతు ఇచ్చి, ముందుకు నడిపించినందుకు రవీంద్ర బెనర్జీ గారికి అభినందనలు. ఇంత అద్భుతమైన చిత్రానికి సపోర్ట్ గా ఉన్నందుకు, అందులో భాగమైనందుకు సినిమాలో పని చేసిన ప్రతీ ఒక్కరికీ అభినందనలు” అంటూ రాసుకొచ్చాడు ఎన్టీఆర్. దీంతో, ఎన్టీఆర్ చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది. అలాగే తమ సినిమాపై ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో పోస్ట్ చేయడం పట్ల చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.