King 100 Glimpse: నాగార్జున 100వ సినిమా ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసింది.. రిలీజ్ డేట్ కూడా అనౌన్స్..
King 100 Glimpse: మీరు కూడా కింగ్ 100 గ్లింప్స్ చూసేయండి.. (Nagarjuna)
- Saketh U
- Updated on- August 29, 2026 / 12:25 PM IST
Akkineni Nagarjuna King 100 Glimpse Released On His Birthday
King 100 Glimpse: అక్కినేని హీరో, టాలీవుడ్ కింగ్ నాగార్జున వందవ సినిమా గ్లింప్స్ ని రిలీజ్ చేసారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని ఫ్యామిలీ నిర్మాణంలో తమిళ దర్శకుడు రా కార్తీక్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. నేడు నాగార్జున పుట్టిన రోజు కావడంతో ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ని రిలీజ్ చేసారు.
ఈ సినిమా టైటిల్ కూడా ‘కింగ్ 100’ అని పెట్టడం గమనార్హం. ఇక ఈ సినిమాని డిసెంబర్ 24 క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ గ్లింప్స్ చూస్తుంటే డబ్బు లేని ఓ పేదవాడు కసిగా ఎదిగి, మోసాలు చేస్తూ బాగా సంపాదించి కింగ్ స్థాయికి ఎదిగే కథాంశంతో ఉండబోతుందని తెలుస్తుంది. అలాగే ఫాదర్ ఎమోషన్ కూడా ఉండబోతుంది అని, నాగార్జున ఇందులో ఫ్లాష్ బ్యాక్ లో యంగ్ వర్షన్ లో కూడా కనిపించబోతున్నట్టు గ్లింప్స్ చూస్తే తెలుస్తుంది.
మీరు కూడా కింగ్ 100 గ్లింప్స్ చూసేయండి..
