Akshay Kumar: బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఎస్కార్ట్ కారుకి ప్రమాదం

అక్షయ్ కుమార్(Akshay Kumar) కాన్వాయ్‌కి సంబంధించిన ఎస్కార్ట్ కారుకి ప్రమాదం జరిగింది.

Bollywood actor Akshay Kumar escort car met with an accident. (1)

  • హీరో అక్షయ్ కుమార్ ఎస్కార్ట్ కారుకి ప్రమాదం
  • వేగంగా వచ్చిన ఆటోరిక్షా డీ కొనడంతో ప్రమాదం
  • ప్రమాదం జరిగిన కారులో అక్షయ్ కుమార్ లేరు

Akshay Kumar: బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కాన్వాయ్‌కు సంబంధించిన ఎస్కార్ట్ కారుకి ప్రమాదం జరిగింది. సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఇద్దరు గాయపడినట్టు తెలుస్తోంది. అయితే, ప్రమాదం జరిగిన కారులో అక్షయ్ కుమార్(Akshay Kumar) లేరు. దీంతో, ఆయనకు ఎలాంటి ప్రమాదం కానీ, గాయాలు జరుగలేదు. అయితే, ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు, ఈ ప్రమాదం అక్షయ్ కుమార్ నివాసం సమీపంలో ఉన్న జూహు ప్రాంతంలో జరిగింది.

JioHotstar: వినియోగదారులకు షాక్.. జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ధరలు పెరుగనున్నాయి.

అదే రోడ్ పై వేగంగా వస్తున్న ఆటోరిక్షా ఒకటి కారును ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకుందని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమాక్షించారు. ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.