JioHotstar: వినియోగదారులకు షాక్.. జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ధరలు పెరుగనున్నాయి.
జియోహాట్‌స్టార్(JioHotstar) తన సూపర్, ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ధరలను సవరించనుంది.
JioHotstar to make super and premium subscription price
- జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ధరలలో సవరణ
- ఉన్నత స్థాయి వినియోగదారుల త్రైమాసిక, వార్షిక రేట్లు పెంపు
- జనవరి 28నుంచి అమలులోకి కొత్త ప్లన్స్
JioHotstar: ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్‌స్టార్(JioHotstar) వినియోగదారులకు షాక్ ఇవ్వనుంది. సంస్థ తన సూపర్, ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ధరలను పెంచనుంది. ఈమేరకు సోమవారం అధికారిక ప్రకటన చేసింది. అలాగే, అన్ని వర్గాలలో నెలవారీ ప్లాన్‌లను ప్రవేశపెట్టినట్లు కూడా ప్రకటించింది. ఈ కొత్త ప్లాన్ ను జనవరి 28 నుంచి అందుబాటులోకి రానున్నాయి.
Riddhi Kumar: కొంటె చూపుతో అందాల మంటపుట్టిస్తున్న రిద్ది కుమార్.. ఫొటోలు
ఈ సవరణలో భాగంగా ఉన్నత స్థాయి వినియోగదారుల కోసం త్రైమాసిక, వార్షిక రేట్లను పెంచనుంది. అలాగే, మొబైల్ యూజర్స్ కి రూ.79 నుంచి ప్రారంభమయ్యే తక్కువ ధర నెలవారీ ఎంట్రీ పాయింట్లను యాడ్ చేసింది. అయితే, మొబైల్ వినియోగదారులకు త్రైమాసిక, వార్షిక ధరలలో ఎలాంటి మార్పు ఉండదు. కానీ, సూపర్, ప్రీమియం సబ్‌స్క్రైబర్స్ మాత్రం ఎక్కువ కాల వ్యవధి ప్లాన్‌లపై అధికంగా చెల్లించాల్సి ఉంటుంది.
వాటిలో ప్రీమియం వార్షిక సబ్‌స్క్రిప్షన్ ధర రూ.1,499 నుంచి రూ.2,199కి పెరగగా.. సూపర్ వార్షిక సబ్‌స్క్రిప్షన్ ధర రూ.899 నుంచి రూ.1,099కి పెరిగింది. అంతేకాదు, వీరి త్రైమాసిక సబ్‌స్క్రిప్షన్ ధరలు కూడా పెరిగినట్టుగా ప్రకటించారు. ఇక అన్ని ప్లాన్‌లలో నెలవారీ ఆప్షన్‌లను కూడా జత చేసింది. దీనివల్ల కొత్త వినియోగదారులకు, స్వల్పకాలిక వినియోగదారులకు లాభం కలుగనుంది. మొత్తంగా ఈ ధరల సవరణతో జియో హాట్‌స్టార్ తన వినియోగదారులకు షాక్ ఇచ్చింది అనే చెప్పాలి.
సవరణ తర్వాత ధరలు ఇలా ఉన్నాయి:
| Tier | Plan Duration | Old Price (₹) | New Price (from Jan 28, 2026) (₹) |
| Mobile | Monthly | Not available | 79 |
| Mobile | Quarterly | 149 | 149 |
| Mobile | Annual | 499 | 499 |
| Super | Monthly | Not available | 149 |
| Super | Quarterly | 299 | 349 |
| Super | Annual | 899 | 1099 |
| Premium | Monthly | 299 | 299 |
| Premium | Quarterly | 499 | 699 |
| Premium | Annual | 1499 | 2199 |
