Akshay Kumar Loss 1000 Crore For Not Releasing Movies
Akshay Kumar: లాక్‌డౌన్‌తో చాలా మంది స్టార్ల సినిమాలు రిలీజ్ అవ్వక చాలా ఇబ్బంది పడ్డారు. ఉన్న సినిమాలు కంప్లీట్ చెయ్యలేకపోవడంతో రిలీజ్‌లన్నీ పోస్ట్‌పోన్ అయ్యాయి. పరిస్థితులు చక్కబడుతున్నాయి కదా అని రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన బాలీవుడ్ హీరో అక్షయ్.. మరోసారి తన సినిమాను పోస్ట్‌పోన్ చెయ్యాల్సి వచ్చింది. బాలీవుడ్‌లో ఈ పోస్ట్‌పోన్‌లతో అక్షయ్ ఎంతలా నష్టపోయారో చూద్దాం.
సంవత్సరానికి మినిమం 3,4 సినిమాలు రిలీజ్ చేసే అక్షయ్ కరోనా దెబ్బకి కనీసం సగం కూడా రిలీజ్ చెయ్యలేక పోతున్నారు. సెకండ్ వేవ్ తర్వాత ఫస్ట్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన అక్షయ్ కుమార్ కూడా మరోసారి తన సినిమా రిలీజ్‌ను పోస్ట్‌పోన్ చేసుకున్నారు. అక్షయ్ కుమార్, వాణి కపూర్, హ్యూమా ఖురేషి, లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ‘బెల్ బాటమ్’ సినిమా జులై 27న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు.. అయితే ఇప్పుడు ఈ సినిమాని ఆగస్ట్ 19కి పోస్ట్‌పోన్ చేస్తున్నట్టు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది టీమ్.
లాక్‌డౌన్ టైమ్‌లో ఎక్కువ నష్టపోయిన హీరో ఎవరైనా ఉన్నారంటే అది అక్షయ్ కుమారే. సంవత్సరానికి ఈజీగా 4 సినిమాలు రిలీజ్ చేసే ఛాన్స్ మిస్ అవ్వడంతో పాటు ఉన్న సినిమాలు పోస్ట్‌పోన్ అవ్వడంతో కొత్త సినిమాలు కమిట్ అయ్యే ఛాన్స్ మిస్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ ఏప్రిల్‌లో రిలీజ్ కావల్సిన ‘సూర్యవన్షీ’ కూడా పెండింగ్‌లోనే ఉంది. బాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌గా తెరకెక్కిన ‘సూర్యవన్షీ’ కూడా ఇంకా రిలీజ్ మీద క్లారిటీ ఇవ్వలేకపోతోంది.
ఈ సినిమాలే కాకుండా థియేటర్ల కోసం చూసీ చూసీ ‘కాంచన’ రీమేక్ అయిన ‘లక్ష్మీ’ ని కూడా ఓటీటీలోనే రిలీజ్ చెయ్యాల్సి వచ్చింది అక్షయ్ కుమార్‌కి. సినిమాకి కనీసం 100 కోట్ల మార్కెట్ పెట్టుకున్నా.. దాదాపు 10 సినిమాలతో వెయ్యి కోట్ల మార్కెట్ ఉన్న అక్షయ్ కుమార్ ఇప్పుడు సినిమాలేవీ రిలీజ్ కాక.. మార్కెట్ లాస్ అవుతున్నారు.. అక్షయ్, ‘రామ్ సేతు’, ‘బచ్చన్ పాండే’, ‘పృథ్వీ రాజ్’, ‘అతరంగీ’, ‘రక్షా బంధన్’ సినిమాలతో ఎంగేజ్ అయ్యారు. ఉన్న సినిమాలు రిలీజ్ అయ్యేదెప్పుడో, కొత్త సినిమాలు కంప్లీట్ చేసేదెప్పుడో అని వెయిట్ చేస్తున్నారు అక్షయ్ కుమార్.