అక్షయ్ కుమార్ ఎక్కువ పారితోషకం తీసుకునే బాలీవుడ్ స్టార్ మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా భారీగా పారితోషకం తీసుకునే వాళ్లలో నాలుగో స్థానంలో అక్షయ్ నిలిచాడు. ఈ సంవత్సరం అత్యంత పారితోషికం తీసుకుంటున్న ప్రముఖుల లిస్ట్‌ని ఫోర్బ్స్ ప్రకటించింది. ఇందులో డ్వేన్ ‘ది రాక్’ జాన్సన్, క్రిస్ హేమ్స్‌వర్త్, రాబర్ట్ డౌనీ తర్వాత భారత్ నుంచి బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నాలుగో స్థానంలో నిలిచారు.
ఫోర్బ్స్ రిపోర్టు ప్రకారం… 2018, జూన్ 1 నుంచి 2019, జూన్ 1 లోగా అక్షయ్ 65 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 466 కోట్లు) సంపాదించినట్లు తేలింది. అక్షయ్ ఒక సినిమాకి కనీసం 5 నుండి 10 మిలియన్ల వరకు వసూలు చేస్తాడని తెలుస్తోంది. సినిమాలు మాత్రమే కాదు.. అక్షయ్ 20కి పైగా వివిధ రకాల టాప్ బ్రాండ్స్ కి అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. వీటి, నుంచి కూడా అక్షయ్ కోట్ల రూపాయిలను సంపాదిస్తున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా అత్యాధిక పారితోషకం అందుకుంటున్న హీరోలు…
1. డ్వేన్ జాన్సన్ – 89.4 మిలియన్ డాలర్లు.
2. క్రిస్ హెమ్స్‌వర్త్ – 76.4 మిలియన్ డాలర్లు.
3. రాబర్ట్ డౌనీ జూనియర్ – 66 మిలియన్ డాలర్లు.
4. అక్షయ్ కుమార్ – 65 మిలియన్ డాలర్లు.
5. జాకీ చాన్ – 58 మిలియన్ డాలర్లు.
6. బ్రాడ్లీ కూపర్ – 57 మిలియన్ డాలర్లు.
7. ఆడమ్ సాండ్లర్ – 57 మిలియన్ డాలర్లు.
8. క్రిస్ ఇవాన్స్ – 43.05 మిలియన్ డాలర్లు.
9. పాల్ రూడ్ – 41 మిలియన్ డాలర్లు.
10. విల్ స్మిత్ – 35 మిలియన్ డాలర్లు.