Sunny Deol : సన్నీడియోల్, అక్షయ్ కుమార్‌ల మధ్య ఒప్పందం..? అప్పు తీర్చనున్న ఖిలాడి..?
బాలీవుడ్ నటుడు సన్నీడియోల్ (Sunny Deol) తీసుకున్న అప్పును చెల్లించేందుకు హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar) ముందుకు వచ్చారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
- Thota Vamshi Kumar
- Published On : August 21, 2023 / 04:39 PM IST
Sunny Deol-Akshay Kumar
Sunny Deol-Akshay Kumar : బాలీవుడ్ నటుడు సన్నీడియోల్ (Sunny Deol) తీసుకున్న అప్పును చెల్లించేందుకు హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar) ముందుకు వచ్చారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్‌గా మారగా దీనిపై అక్షయ్ టీమ్ స్పందించింది. ఈ వార్త పూర్తిగా అవాస్తవం అని చెప్పింది. ఇందులో ఏ మాత్రం నిజం లేదని తెలిపింది.
కొన్నాళ్ల క్రితం సన్నీడియోల్ ముంబై జుహూ ప్రాంతంలోని గాంధీగ్రామ్ రోడ్‌లో ఉన్న విల్లాను గ్యారెంటీగా పెట్టి బ్యాంక్ ఆఫ్ బరోడాలో రూ.56 కోట్లను అప్పుగా తీసుకున్నాడు. దీన్ని చెల్లించడంతో అతడు విఫలం అయ్యాడు. లోన్ రికవరీలో భాగంగా సన్నీ విల్లాను వేలం వేయాలని సదరు బ్యాంకు నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఆదివారం (ఆగస్టు 20న) అన్ని దినపత్రికల్లో విల్లాను వేలం వేస్తున్నట్లు ఓ ప్రకటనను ఇచ్చింది.
Raviteja : యూరప్ బయలుదేరిన మాస్ మహారాజ్ రవితేజ.. ఎందుకో తెలుసా..?
సన్నీ డియోల్.. తన తండ్రి ధర్మేంద్ర, సోదరుడు బాబీతో పాటు జుహూలోని విల్లాను గ్యారంటర్లుగా చూపించి రుణం తీసుకున్నట్లు, ఈ రుణానికి వడ్డీ కూడా చెల్లించాలని, సెప్టెంబర్ 25న సదరు విల్లాను వేలం వేయనున్నట్లు సదరు ప్రకటనలో పేర్కొంది. అయితే.. సాంకేతిక సమస్యలను కారణంగా చూపిస్తూ వేలానికి సంబంధించిన నోటీసును బ్యాంకు సోమవారం వెనక్కు తీసుకుంది.
ఇదిలా ఉంటే.. సన్నీడియోల్ కు సాయం చేయాలని అక్షయ్ కుమార్ నిర్ణయించుకున్నారనే ఓ వార్త ఈ ఉదయం నెట్టింట వైరల్‌గా మారింది. సన్నీ, అక్షయ్‌ల మధ్య ఒప్పందం కుదిరిందని, దీంతో రుణాన్ని అక్షయ్ చెల్లించనున్నారని ఆ వార్త సారాంశం. అక్షయ్ రుణం తీర్చిన తరువాత కొద్ది రోజుల్లోనే సన్నీ ఆ నగదును అక్షయ్‌కు వెనక్కి ఇవ్వనున్నట్లు ఆ వార్తలో పేర్కొన్నారు. దీనిపై అక్షయ్ టీమ్ స్పందిస్తూ ఇందులో నిజం లేదని చెప్పింది.
Theatrical Movies : ఈ వారం తెలుగులో రిలీజ్ అయ్యే థియేట్రికల్ సినిమాలు ఇవే..
