Akshay Kumar: బాలీవుడ్ కా బాద్షా.. అక్షయ్ కెరీర్లో వందకోట్ల సినిమాలు 20.. ఇది ఆల్ టైం రికార్డ్
వందకోట్ల గ్రస్స్ కలెక్షన్స్ సాధించిన సినిమాలు 20 చేసి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన అక్షయ్ కుమార్(Akshay Kumar).
- V Santhosh Kumar
- Published on- April 27, 2026 / 07:25 PM IST
Akshay Kumar sets all-time record by delivering 20 films grossed 100 crore
- అక్షయ్ కెరీర్లో 20 వందకోట్ల సినిమాలు
- 18 సినిమాలతో సల్మాన్ రెండో స్థానం.
- బాక్సాఫీస్ వద్ద అక్షయ్ ఆల్-టైమ్ రికార్డ్.
Akshay Kumar: ఇండియన్ సినీ ఇండస్ట్రీలో బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల వసూళ్లు సాధించడం అనేది ఒక ప్రతిష్టాత్మకమైన మైలురాయి. అమీర్ ఖాన్ ‘గజినీ’తో మొదలైన ఈ ధోరణి, నేడు స్టార్ హీరోల విజయానికి ప్రామాణికంగా మారింది. ముఖ్యంగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఈ క్లబ్‌లో చేరడం అనేది హీరోల మార్కెట్ స్టామినాకు నిదర్శనంగా మారింది. ఈ నేపధ్యంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ తన కెరీర్‌లో అత్యంత వేగంగా వంద కోట్ల చిత్రాలను డెలివర్ చేస్తూ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించారు.
Karthi-Boyapati: అల్లు అర్జున్ ప్లేస్ లో కార్తీ.. మాస్ కాంబో సెట్ చేస్తున్న బోయపాటి శ్రీను
తాజా సమాచారం ప్రకారం, అక్షయ్ కుమార్(Akshay Kumar) నటించిన లేటెస్ట్ మూవీ ‘భూత్ బంగ్లా’ (2026) వంద కోట్ల క్లబ్‌లో చేరింది. దాంతో, అక్షయ్ కెరీర్‌లో వందకోట్లు సాధించిన చిత్రాల సంఖ్య 20కి చేరింది. ఇది ఒక ఆల్ టైమ్ రికార్డ్ అవడం విశేషం. అక్షయ్ తర్వాత సల్మాన్ ఖాన్ 18 సినిమాలతో రెండో స్థానంలో ఉండగా, అజయ్ దేవగన్ 16 సినిమాలతో తర్వాతి స్థానంలో ఉన్నారు. షారూఖ్ ఖాన్ 10 సినిమాలు, రణ్‌వీర్ సింగ్ 9 సినిమాలతో ఈ జాబితాలో కొనసాగుతున్నారు. హృతిక్ రోషన్, అమీర్ ఖాన్ వంటి వారు కూడా రేసులో ఉన్నప్పటికీ టాప్ లో మాత్రం అక్షయ్ కుమార్ ఉన్నారు.
సౌత్ సూపర్ స్టార్స్ రజనీకాంత్, విజయ్, ప్రభాస్ వంటి హీరోలకు వంద కోట్ల మార్కును అందుకున్న చిత్రాలు ఉన్నప్పటికీ, అక్షయ్ కుమార్ వలె ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేస్తూ ఈ స్థాయిలో వంద కోట్ల హిట్లు సాధించిన వారు ఎవరూ లేరు. తన సినిమాను బడ్జెట్‌ను అదుపులో ఉంచుతూ, ఎక్కువ సినిమాలతో ప్రేక్షకులను పలకరించడం వల్లనే అక్షయ్‌కి ఈ అరుదైన ఘనత సాధ్యమైంది. అందుకే ఆయనను బాక్సాఫీస్ వద్ద ‘సేఫ్ బెట్’గా, అత్యంత కన్సిస్టెంట్ హీరోగా సినీ విశ్లేషకులు అభివర్ణిస్తారు.
