నిప్పంటించుకున్న అక్షయ్ కుమార్

అవునండి నిజం..బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ నిప్పంటించుకుని రచ్చ రచ్చ చేశాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

  • Publish Date - March 6, 2019 / 08:11 AM IST

అవునండి నిజం..బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ నిప్పంటించుకుని రచ్చ రచ్చ చేశాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

అవునండి నిజం..బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ నిప్పంటించుకుని రచ్చ రచ్చ చేశాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అసలు ఏమైందోనని ఆయన అభిమానులు, ఇతరులు నెట్‌లో సెర్చ్ చేశారు. సినిమాలో డూప్ లేకుండా ఇతను పలు విన్యాసాలు చేసిన సంగతి తెలిసిందే. ఫైట్లు, ఇతర సీన్లలో ఆయన జలదరించే సాహసాలు చేస్తుంటాడు.

స్వయంగా అక్షయ్ కుమార్ మార్షల్ ఆర్ట్స్‌లో నిపుణుడు. బాలీవుడ్‌లో సంవత్సరానికి రెండు కంటే ఎక్కువ సినిమాలు చేస్తూ సక్సెస్ బాటలో పయనిస్తున్న ఈ ‘ఖిలాడీ’ పలు కంపెనీలకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. రియాల్టీ షోలో కూడా ఇతను కనిపిస్తున్నాడు. 
Also Read : దబిడిదిబిడే : బాలకృష్ణనే అడ్డుకున్న మహిళలు

తాజాగా డిజిటల్ మీడియాలో కూడా ఎంట్రీ ఇస్తున్నాడు. అమెజాన్ డిజిటల్ మీడియాలో రాజ్యం ఏలుతోంది. నెట్ ఫ్లిక్స్, విఐయు, హాట్ స్టార్‌లు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఈ అమెజాన్ ప్రైమ్‌ అక్షయ్ కుమార్‌తో డీల్ కుదుర్చుకుంది. ‘ది ఎండ్’ పేరిట సిరీస్‌ను అమెజాన్ మొదలు పెట్టబోతోంది. ఇందులో అక్షయ్ కుమార్ మెయిన్ లీడ్ చేస్తున్నాడు. ముంబై‌లో ‘ది ఎండ్ ప్రమోషన్’ కార్యక్రమం ఘనంగా జరిగింది.

ఇందులో అక్షయ్ ఎంట్రీ ఇచ్చాడు. ఒంటికి నిప్పంటించుకుని అతను వస్తుండడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఏ మాత్రం ఆందోళన పడకుండా అక్షయ్ కుమార్ అటూ..ఇటూ తిరిగాడు. తన కుమారుడి కోసం అంగీకారం తెలిపినట్లు అక్షయ్ వెల్లడించాడు. త్వరలోనే ఇది ప్రసారం కానుంది. ఇదిలా ఉంటే దీనిపై అక్షయ్ కుమార్ సతీమణి ట్వింకిల్ ఖన్నా తీవ్రంగా స్పందించారు. ట్విట్టర్‌లో ట్వీట్ చేసింది. ఇంటికి రా చెబుతానంటూ పేర్కొన్నారు. 
Also Read : సరిదిద్దుకోండి : క్రెడిట్ కార్డుపై చేసే 6 తప్పులు ఇవే