Ali New Movie Poster Released
Ali: ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ ఆహా మరో సస్పెన్స్ థిల్లర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతుంది. దీపావళి సందర్భంగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ, మూవీ పోస్టర్ ని విడుదల చేశారు. “అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి” అనే టైటిల్ తో వస్తున్న ఈ మూవీ మలయాళ “వికృతి” సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతుంది.
Brahmi-Ali: కామెడీనే కాదు వంటలు కూడా అదరగొడుతున్న స్టార్ కమెడియన్స్..
ఈ చిత్రం కొచ్చి మెట్రో రైలులో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందించబడింది. ఈ సినిమాలో హీరోకి చెవులు, నోరు పనిచేయవు. ఒక రోజు మెట్రో రైలులో వెళుతూ అలిసిపోయి నిద్రపోతుంటే. అతను తాగి పడిపోయాడని భావించి ఒక ప్రయాణీకుడు ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తాడు. అది కాస్త వైరల్ అవుతుంది.
వైరల్ అయిన ఫోటో వల్ల ఆ హీరో మరియు అతని కుటుంబాన్ని ఎటువంటి సమస్యలు ఎదురుకోవాల్సి వచ్చింది. చివరకి ఆ సమస్య నుంచి ఎలా బయటపడ్డారు అనేది చాలా ఇంట్రస్టింగ్ గా చూపించాడు దర్శకుడు. అక్టోబర్ 28న వస్తున్న ఈ తెలుగు రీమేక్ మూవీ ఎంతటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Oka photo online lo sanchalanam chesthe. Ela untundi? ? Daani venuka story enti? Watch the official remake of Vikruthi #AndaruBaagundaliOnAHA Premieres Oct 28#Ali pic.twitter.com/R8rA4yO6EZ
— ahavideoin (@ahavideoIN) October 24, 2022