Alia Bhatt: అలియా భట్ ‘అతి’ వాగుడు.. ఇండియన్ సినిమాను తక్కువ చేస్తూ.. మండిపడుతున్న నెటిజన్స్
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఇండియన్ సినిమాను తక్కువచేస్తూ వివాదాస్పద కామెంట్స్ చేసిన బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్(Alia Bhatt).
- V Santhosh Kumar
- Published on- May 15, 2026 / 07:33 AM IST
Alia Bhatt Shocking Comments on Male Domination in Indian Cinema
- భారతీయ సినిమాపై అలియా వివాదం.
- మొగుడి సినిమాపై ఎందుకు మౌనం?
- హీరోల రాజ్యానికి ముగింపు ఎప్పుడూ?
Alia Bhatt: బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ అంతర్జాతీయ వేదికైన కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు హాజరైన విషయం తెలిసిందే. దీనికి సంబందించిన ఆమె ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే, తాజాగా ఆమె ఇండియన్ చిత్ర పరిశ్రమలో ఎప్పటి నుండో కొనసాగుతున్న పురుషాధిక్యతపై (Male Dominance) ఆమె చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. ఈ వేదికపై ఆమె మాట్లాడుతూ.. భారతీయ సినిమాల్లో 75 శాతం కథలు కేవలం హీరోల చుట్టూనే తిరుగుతున్నాయని, కథ కంటే నటుడికే ప్రాధాన్యత ఇస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. కేవలం హీరో ఉన్నాడా లేదా అని చూడకుండా, బలమైన కథాంశంతో సినిమాలు ఎందుకు తీయలేకపోతున్నారని ఆమె ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
NtrNeel: సాలార్ లో కాటేరమ్మ.. డ్రాగన్ లో కాళీ ఘాట్.. థియేటర్స్ తగలబడిపోవడం ఖాయం
అయితే అలియా (Alia Bhatt)చేసిన విమర్శలపై నెటిజన్ల నుండి వ్యతిరేకత కూడా వ్యక్తమవుతోంది. హాలీవుడ్‌ను పొగిడే క్రమంలో భారతీయ సినిమాను తక్కువ చేశారనే విమర్శలు వస్తుండగా, మరికొందరు ఆమె వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా ఆమె భర్త రణ్‌బీర్ కపూర్ నటించిన ‘యానిమల్’ వంటి అత్యంత పురుషాధిక్యత కలిగిన సినిమాను ఆమె ఎందుకు ప్రశ్నించలేదంటూ కౌంటర్లు వేస్తున్నారు. ఒక పక్క గ్లోబల్ వేదికపై ఇండియా ప్రతిష్టను తగ్గించారని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే, మరికొందరు ఆమె అడిగిన ప్రశ్నలో వాస్తవం ఉందని మద్దతు తెలుపుతున్నారు.
కేవలం అలియా మాత్రమే కాకుండా గతంలో కృతి సనన్, కంగనా రనౌత్, తాప్సీ వంటి నటీమణులు కూడా ఇండస్ట్రీలో ఉన్న వివక్షపై గళం విప్పారు. తనకంటే జూనియర్ హీరోలకు విలాసవంతమైన బహుమతులు ఇస్తూ, హీరోయిన్లను తక్కువ చేస్తున్నారనే కృతి సనన్ వ్యాఖ్యలు అప్పట్లో వైరల్ అయ్యాయి. పారితోషికం నుండి గౌరవం వరకు ప్రతి విషయంలోనూ హీరోలకే అగ్రపీఠం వేయడంపై హీరోయిన్లు అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో, ఇండియన్ సినిమాలో మార్పు ఎప్పుడు వస్తుంది? కథలే హీరోలుగా సినిమాలు ఎప్పుడు రూపుదిద్దుకుంటాయి? అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.
