NtrNeel: సాలార్ లో కాటేరమ్మ.. డ్రాగన్ లో కాళీ ఘాట్.. థియేటర్స్ తగలబడిపోవడం ఖాయం
సాలార్ సినిమాలో కటేరమ్మ ఫైట్ రేంజ్ లో ఎన్టీఆర్(NtrNeel) డ్రాగన్ లో కూడా ఒక సీక్వెన్స్ ప్లాన్ చేస్తున్న ప్రశాంత్ నీల్.
Prashanth Neel planning a fight sequence in NTR Dragon like Salaar Kateramma fight
- సలార్ మించి ఎన్టీఆర్ యాక్షన్.
- కాళీ ఘాట్ ఫైట్ విధ్వంసం.
- నీల్ తారక్ మాస్ ఊచకోత.
NtrNeel: మ్యాన్ అఫ్ మాసెస్ ఎన్టీఆర్, మాస్ సినిమాల స్పెషలిస్ట్ ప్రశాంత్ నీల్ కాంబోలో సినిమా అనౌన్స్ అయినప్పటి నుండే అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. ‘సలార్’ వంటి భారీ హిట్ తర్వాత నీల్ తెరకెక్కిస్తున్న చిత్రం కావడం, ‘దేవర’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన తారక్ హీరో కావడంతో ఈ ప్రాజెక్ట్ ఇండియన్ సినిమాలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనదిగా మారింది. ముఖ్యంగా నీల్ మార్క్ ఎలివేషన్స్, తారక్ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ కలిసి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
Mukku Avinash: ముక్కు అవినాష్ కుమారుడు అద్వైత్ ఫస్ట్ బర్త్ డే వేడుకలు.. ఫోటోలు వైరల్
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో వచ్చే ‘కాళీ ఘాట్’ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే హైలైట్‌గా నిలవనుందట. ‘సలార్’లో మనం చూసిన కాటేరమ్మ ఫైట్ ఒక ఎత్తు అయితే, అంతకంటే పది రెట్లు మాస్, వైల్డ్ ఎనర్జీతో ఈ కాళీ ఘాట్ సీక్వెన్స్‌ను ప్రశాంత్ నీల్ డిజైన్ చేస్తున్నారట. ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటివరకు ఎవరూ ఊహించని రేంజ్లో ఈ పోరాట ఘట్టం ఉంటుందని, థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు తెప్పించడం ఖాయమని టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం ఈ సీక్వెన్స్ కోసం భారీ సెట్టింగ్స్, విజువల్ ఎఫెక్ట్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రశాంత్ నీల్(NtrNeel) తనదైన ‘డార్క్ థీమ్’ను కొనసాగిస్తూనే, ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఈ ఇద్దరు దిగ్గజాలు కలిసి వస్తుండటంతో, వెండితెరపై ఒక ‘బిగ్గెస్ట్ మాస్ విధ్వంసం’ చూడబోతున్నామనేది వాస్తవం. అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఎన్టీఆర్ బర్త్ డే రోజున ఈ సినిమా నుంచి స్పెషల్ టీజర్ ను విడుదల చేయనున్నారు మేకర్స్. ఈ టీజర్ ఎంత అరాచకంగా ఉంటుంది అనేది తెలుసుకోవడానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
