Kanaka Durga: అల్లరి నరేష్ మూవీ ఓపెనింగ్.. తరలి వచ్చిన లేడీ సూపర్ స్టార్స్.. ఫొటోలో ఎవరెవరు ఉన్నారో తెలుసా?
అల్లరి నరేష్ హీరోగా మొదలైన కనక దుర్గ(Kanaka Durga) మూవీ. కదలి వచ్చిన టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్స్.
- V Santhosh Kumar
- Published On : April 4, 2026 / 01:55 PM IST
allari naresh kanaka durga movie opening
- అల్లరి నరేష్ కొత్త సినిమా కనక దుర్గ
- ఓపెనింగ్ వచ్చేసిన టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్స్
- వైరల్ అవుతున్న ఫొటోస్
Kanaka Durga: టాలీవుడ్ అల్లరోడు అల్లరి నరేశ్ హీరోగా ప్రదీప్ మద్దాలి దర్శకత్వంలో ‘కనక దుర్గ’ అనే సరికొత్త చిత్రం ఘనంగా ప్రారంభమైంది. అత్యంత శక్తిమంతమైన కంటెంట్‌తో రూపొందుతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు తాజాగా జరిగాయి. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి, కెమెరా స్విచ్ ఆన్ చేసి సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. విభిన్నమైన కథాంశంతో వస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవంలో టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు పాల్గొని చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.
Anupama Parameswaran: హ్యాపీ బర్త్ డే అమ్మ.. తల్లికి విషెష్ చేపిస్తూ స్పెషల్ ఫోటోలు షేర్ చేసిన అనుపమ
ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుకలో టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్స్, ప్రముఖ నిర్మాతలు సందడి చేయడం విశేషం. చిరంజీవి సతీమణి సురేఖతో పాటు ప్రముఖ నిర్మాత దిల్ రాజు భార్య తేజస్విని, ఆయన కుమార్తె హన్షిత రెడ్డి, ప్రముఖ నిర్మాత స్వప్న దత్, అల్లరి నరేశ్ భార్య విరూప తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. వీరందరూ ఒకే వేదికపై కనిపించడంతో ఈ కార్యక్రమం సినీ వర్గాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ప్రస్తుతం ‘కనక దుర్గ’ ప్రారంభోత్సవానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అల్లరి నరేశ్ తన కెరీర్‌లో మరో వైవిధ్యమైన పాత్రతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతుండటం, దానికి తోడు ఇంతమంది సినీ ప్రముఖులు ఆశీస్సులు అందజేయడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. పవర్ ఫుల్ టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రం త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.
