Allari Naresh : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ పై స్పందించిన అల్లరి నరేష్.. ఏమన్నారంటే..?

ఆరుగురు పతివ్రతలు రీ రిలీజ్ చేయమని పలువురు సోషల్ మీడియాలో ఎప్పట్నుంచో అడుగుతున్నారు. (Allari Naresh)

  • Published on- September 2, 2026 / 01:35 PM IST

Allari Naresh

Allari Naresh : ఒకప్పటి హిట్ సినిమాలు, కల్ట్ క్లాసిక్ సినిమాలు రీ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. రీ రిలీజ్ కి కూడా ప్రేక్షకులు బాగానే వస్తున్నారు, కలెక్షన్స్ వస్తున్నాయి. దీంతో అనేక సినిమాలు రీ రిలీజ్ కి క్యూ కడుతున్నాయి. ఒకప్పటి కల్ట్ సినిమా ఆరుగురు పతివ్రతలు రీ రిలీజ్ చేయమని పలువురు సోషల్ మీడియాలో ఎప్పట్నుంచో అడుగుతున్నారు.

2004లో ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో, నిర్మాణంలో ఓ ఎమోషనల్ మెసేజ్ ఓరియెంటెడ్ గా కాస్త అడల్ట్ టచ్ తో వచ్చిన ఆరుగురు పతివ్రతలు సినిమా అప్పట్లో మంచి విజయం సాధించింది. అప్పట్లోనే ఇలాంటి బోల్డ్ అటెంప్ట్ చేసి సక్సెస్ అయ్యారు. ఈ సినిమాలో సీన్స్ సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో వైరల్ అవుతూనే ఉంటాయి. ఇటీవల ఈ సినిమా రీ రిలీజ్ అవుతుందని పోస్టర్స్ కూడా సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి.

Also Read : OG Universe : పవన్ బర్త్ డే.. ఓజీ 2 అప్డేట్ ఇచ్చిన సుజీత్.. స్పెషల్ వీడియో.. రిలీజ్ ఎప్పుడంటే..?

అయితే తాజాగా అల్లరి నరేష్ ఈ సినిమా రీ రిలీజ్ పై స్పందించారు. ఈ సినిమా అల్లరి నరేష్ తండ్రి ఇవివి నిర్మాణ సంస్థలోనే తెరకెక్కింది. ఈ సినిమా హక్కులు అల్లరి నరేష్ దగ్గరే ఉన్నాయి. నరేష్.. రంభ ఊర్వశి మేనక సినిమాతో సెప్టెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడగా రీ రిలీజ్ లపై మాట్లాడారు.

అల్లరి నరేష్ మాట్లాడుతూ.. శంభో శివ శంభో రీ రిలీజ్ కి మంచి స్పందన వచ్చింది. రీ రిలీజ్ లు నా చేతిలో ఉండవు. కొంతమంది కితకితలు, కొంతమంది సుడిగాడు, ఇలా నా పాత సినిమాలు రీ రిలీజ్ చేయమని అడుగుతున్నారు. కానీ అది డిస్ట్రిబ్యూటర్, నిర్మాత చేతిలో ఉంటాయి. ఆరుగురు పతివ్రతలు రీ రిలీజ్ చేయమని నన్ను అడిగారు. సోషల్ మీడియాలో ఆ సినిమా రీ రిలీజ్ పై వచ్చిన పోస్టులు నాకు పంపారు. కానీ ఆ సినిమా రీ రిలీజ్ చేసే ఆలోచన లేదు అని అన్నారు. దీంతో ఆరుగురు పతివ్రతలు రీ రిలీజ్ ఇప్పట్లో లేదని తెలుస్తుంది.

Also Read : Bigg Boss Telugu 10 : బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తున్న స్టార్ విలన్.. ఎన్టీఆర్ సినిమాతో ఫేమ్ తెచ్చుకొని..