Allipoola Vennela: తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయలకు ప్రతీక బతుకమ్మ పండుగ.. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ‘అల్లిపూల వెన్నెల’ అనే అందమైన బతుకమ్మ పాటను రూపొందించారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను .. బతుకమ్మ పండుగ యొక్క విశిష్టతను తెలియజేసేలా రూపొందించిన ఈ పాటను ఎంపీ కవిత విడుదల చేశారు.
Nandamuri Balakrishna : ‘ఆహా’ లో బాలయ్య అదిరిపోయే టాక్ షో..!
ప్రపంచ ప్రఖ్యాత సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏ.ఆర్. రెహమాన్ స్వరాలు అందించారు. మిట్టపల్లి సురేందర్ లిరిక్స్ రాశారు. పాపులర్ డైరెక్టర్ గౌతమ్ వాసు దేవ మీనన్ ఈ పాటకు దర్శకత్వం వహించారు.
Udanpirappe : జ్యోతిక 50వ సినిమా.. ట్రైలర్ చూశారా..
‘అల్లిపూల వెన్నెల.. చెరువులోన కురవగా’.. అంటూ సాగే ఈ బతుకమ్మ పాట విశేషంగా ఆకట్టుకుంటుంది. ఉత్తర ఉన్నికృష్ణన్ (చైల్డ్ వాయిస్) తో పాటు రక్షిత, హరిప్రియ, దీప్తి సురేష్, అపర్ణ హరికుమార్, పద్మజ తదితరులు చాలా చక్కగా పాడారు. బృంద మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.