Allu Arha : లిటిల్ ప్రిన్సెస్ సెట్లో అడుగుపెట్టింది..
లిటిల్ ప్రిన్సెస్ అల్లు అర్హ బాలనటిగా కెరీర్ స్టార్ట్ చేసింది..
- sekhar
- Published on- August 3, 2021 / 03:41 PM IST
Allu Arha
Allu Arha: అల్లు ఫ్యామిలీ నుండి మరో వారసురాలు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తోంది. అల్లు రామలింగయ్య ముని మనవరాలు, అల్లు అరవింద్ మనవరాలు, అల్లు అర్జున్ గారాలపట్టి, లిటిల్ ప్రిన్సెస్ అల్లు అర్హ బాలనటిగా కెరీర్ స్టార్ట్ చేసింది. వెండితెర మీద తను కనిపించబోయే ఫస్ట్ సినిమా షూటింగ్‌కి సంబంధించి ఫస్ట్ డే కెమెరా ఫేస్ చెయ్యబోతుంది.
సమంత అక్కినేని ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘శాకుంతలం’.. హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో భారీ బడ్జెట్‌తో గుణశేఖర్ రూపొందిస్తుండగా.. గుణ టీం వర్క్స్ బ్యాన్పై నీలిమ గుణ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ కూడా ఈ సినిమాలో భాగస్వామ్యం అయ్యింది.
Shaakuntalam: సమంతతో గుణశేఖర్ పాన్ ఇండియా మూవీ ‘శాకుంతలం’..
అల్లు అర్హ ‘శాకుంతలం’ మూవీలో లిటిల్ ప్రిన్సెస్ భరత క్యారెక్టర్ చేస్తుంది. నాన్న కారవాన్‌లో అర్హ క్యూట్‌గా మేకప్ వేసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు టీం. మేకప్ వేస్తుండగా భలే ముద్దుగా కూర్చుని ఉంది అర్హ. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది. ఛైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ స్టార్ట్ చేసిన అర్హకి నెటిజన్లు, మెగా – అల్లు ఫ్యాన్స్ విషెస్ తెలియజేస్తున్నారు.
