Allu Arjun: ఇండియాస్ పాపులర్ టాక్ షోలో సందడి చేయనున్న సౌత్ పాన్ ఇండియా స్టార్స్..?
బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహర్ హోస్ట్ చేస్తున్న ‘కాఫీ విత్ కరణ్’ 8వ సీజన్‌ను అతి త్వరలో ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడట. బన్నీ, యష్, రిషబ్ శెట్టిలు ఈ టాక్ షోలో సందడి చేయబోతున్నట్లు తెలుస్తోంది.
- Anil Aaleti
- Published On : March 31, 2023 / 07:01 AM IST
Allu Arjun Along With Yash Rishab Shetty To Grace Koffee With Karan Talk Show
Allu Arjun: ‘పుష్ప-ది రైజ్’ మూవీతో పాన్ ఇండియా స్టార్‌గా అవతరించిన అల్లు అర్జున్, ఆ సినిమాతో బాక్సాఫీస్ వద్ద పలు సరికొత్త రికార్డులను క్రియేట్ చేశాడు. ఓ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీతో కళ్లుచెదిరే వసూళ్లు రాబట్టిన బన్నీ, తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌గా పుష్ప చిత్రానికి సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నాడు. ఇక దక్షిణాదిన కేజీయఫ్ చిత్రంతో మరో పాన్ ఇండియా స్టార్‌గా కన్నడ యాక్టర్ యష్ అవతరించాడు.
Allu Arjun: స్టైలిష్ స్టార్ టు ఐకాన్ స్టార్.. 20 ఏళ్ల సినీ కెరీర్ పూర్తి చేసుకున్న అల్లు అర్జున్!
కేజీయఫ్ 2 సినిమాతో తన స్టార్‌డమ్‌ను మరింతగా పెంచేసుకున్నాడు ఈ హీరో. అటు కాంతార వంటి వైవిధ్యమైన సినిమాను తెరకెక్కించిన యాక్టర్ కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి కూడా ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. కాంతార చిత్రం భాషతో సంబంధం లేకుండా క్రియేట్ చేసిన సెన్సేషన్ దీనికి ఉదాహరణగా నిలుస్తుంది. అయితే, ఇప్పుడు ఈ ముగ్గురు సౌత్ ఇండియా స్టార్స్.. సారీ.. పాన్ ఇండియా స్టార్స్ కలిసి ఒక టాక్ షోలో సందడి చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహర్ హోస్ట్ చేస్తున్న ‘కాఫీ విత్ కరణ్’ ఎంత పాపులారిటీని సొంతం చేసుకుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.
Allu Arjun : అల్లుఅర్జున్ న్యూ లుక్.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్..
ఈ టాక్ షోకు సంబంధించిన 8వ సీజన్‌ను అతి త్వరలో ప్రారంభించేందుకు కరణ్ రెడీ అవుతున్నాడట. ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో ఈ టాక్ షో మొదలవుతుందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఈసారి కేవలం బాలీవుడ్ స్టార్స్‌ను మాత్రమే కాకుండా, తమ సినిమాలతో పాన్ ఇండియా స్టార్స్‌గా ఎదిగిన ఈ ముగ్గురు టాప్ స్టార్స్‌ను తన షోలో గెస్టులుగా కూర్చోబెట్టబోతున్నాడట ఈ డైరెక్టర్. ఇక ఈ 8వ సీజన్ తొలి ఎపిసోడ్‌ను బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌తో స్టార్ట్ చేసేందుకు కరణ్ రెడీ అవుతున్నాడట. నిజంగానే బన్నీ, యష్, రిషబ్ శెట్టిలు ఈ టాక్ షోలో సందడి చేస్తే, ఈ టాక్ షో వ్యూయర్‌షిప్ అమాంతం పైకి వెళ్లడం ఖాయమని ఆయా హీరోల అభిమానులు అంటున్నారు.
