Allu Arjun: AA22 మూవీ క్రేజీ న్యూస్.. వైరల్ అవుతున్న అల్లు అర్జున్ టైటిల్.. ఇక బాక్సాఫీస్ బద్దలవడం ఖాయం

నెట్టింట వైరల్ అవుతున్న అల్లు అర్జున్(Allu Arjun) లేటెస్ట్ మూవీ టైటిల్.

allu arjun and atlee movie title update

  • నెట్టింట వైరల్ అవుతున్న అల్లు అర్జున్ సినిమా టైటిల్
  • కొడుకు పేరునే సినిమాకు సెట్ చేసిన అల్లు అర్జున్
  • టైటిల్ పీక్స్ అంటూ బన్నీ ఫ్యాన్స్ కామెంట్స్

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే 40 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో దీపికా పదుకొనే, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ వంటి స్టార్ హీరోయిన్లు నటిస్తుండగా, రష్మిక మందాన విలన్ గా నటిస్తోంది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

Sharwanand: వెండితెరకు సాష్టాంగ నమస్కారం.. బైకర్ థియేటర్ లో శర్వానంద్ ఎమోషనల్ మూమెంట్

అయితే, ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయి చాలా కాలం అయినప్పటికి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు మేకర్స్. ఫైనల్ గా, ఏప్రిల్ 8న అల్లు అర్జున్(Allu Arjun) పుట్టినరోజు సందర్భంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ మాత్రమే విడుదల చేయనున్నారు మేకర్స్.ఈ విషయం గురించి ఇటీవల నిర్మాత బన్నీ వాసు అధికారిక ప్రకటన చేశారు. దాంతో, అల్లు అర్జున ఫ్యాన్స్ ఆ అప్డేట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం అంతున్న సమాచారం ప్రకారం మేరకు ఈ సినిమాకు ‘అయాన్’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇది అల్లు అర్జున్ కొడుకు పేరు కావడం విశేషం. ఈ సినిమాలో హీరో పాత్ర పేరు కూడా అయాన్ అని, ఇది ఒక సూపర్ హీరో తరహా పాత్ర అని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీంతో, ఈ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఈ టైటిల్ తో ఫుల్ హ్యాపీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి అదే టైటిల్ ను మేకర్స్ ఫిక్స్ చేస్తారా లేక ఇది కేవలం రూమర్ మాత్రమేనా అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.