Raaka: అల్లు అర్జున్ ‘రాకా’లో ప్యారలల్ వరల్డ్ కాన్సెప్ట్.. ఒకే హీరో రెండు ప్రపంచాలు

అల్లు అర్జున్ రాకా(Raaka) సినిమా కోసం రెండు అద్భుతమైన ప్రపంచాలను సృష్టిస్తున్న దర్శకుడు అట్లీ.

Allu Arjun and atlee Raaka movie will feature a parallel world concept.

  • అట్లీ సృష్టిస్తున్న భారీ ప్యారలల్ వరల్డ్
  • రాకా పాత్రలో అల్లు అర్జున్ విధ్వంసం
  • హాలీవుడ్ స్థాయి విజువల్ సైన్స్ ఫిక్షన్

Raaka: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కలయికలో రాబోతున్న ఈ చిత్రం ‘రాకా’. హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను అట్లీ తెరకెక్కిస్తుండగా.. సన్ పిక్చర్స్ సమస్త భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. దాంతో, రాకా సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే, ఇప్పటివరకు మనం చూసిన అల్లు అర్జున్ మాస్ అప్పీల్ ఒక ఎత్తైతే, ఈ సినిమాలో ఆయన పోషించబోయే ‘రాకా’ అనే పాత్ర మరో ఎత్తు కానుందట. దాదాపు రూ.600 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా, కేవలం ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ మాత్రమే కాదు, అంతకు మించి ఒక అద్భుతమైన విజువల్ వండర్ అని సినీ వర్గాలు చెబుతున్నాయి.

Ntr team: ఎన్టీఆర్ పేరుతో మోసాలు.. వారిని నమ్మకండి.. హీరో ఆఫీస్ సీరియస్ వార్నింగ్

ఈ సినిమా ప్రధానంగా ‘ప్యారలల్ వరల్డ్’ (సమాంతర ప్రపంచం) అనే సరికొత్త సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్‌తో రూపొందుతోంది. హాలీవుడ్ స్థాయి విజువల్స్, మైండ్ బెండింగ్ స్క్రీన్ ప్లేతో అట్లీ ఒక విభిన్నమైన ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు. అల్లు అర్జున్ కెరీర్‌లోనే అత్యంత ఖరీదైన ఈ ప్రాజెక్ట్, గ్లోబల్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మితమవుతోంది. వినూత్నమైన కాన్సెప్ట్‌కు అట్లీ మార్క్ మాస్ మ్యాజిక్ తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలవడం ఖాయం.

ఇక ఈ సినిమాకు సంబంధించి అల్లు అర్జున్ గ్లింప్స్ కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ‘రాకా(Raaka)’ లుక్ బయటకు వస్తే సోషల్ మీడియా షేక్ అవ్వడం గ్యారెంటీ అని ట్రేడ్ అనలిస్టులు భావిస్తున్నారు. ప్రయోగాత్మక కథాంశంతో పాటు ప్యూర్ కమర్షియల్ ఎలిమెంట్స్ కలగలిపి అట్లీ అందిస్తున్న ఈ ‘బాక్సాఫీస్ బాంబ్’ భారతీయ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ఒక కొత్త ప్యారలల్ యూనివర్స్‌లో ఐకాన్ స్టార్ ఊచకోత చూడటానికి సిద్ధంగా ఉండండి!