×
Ad

Allu Arjun : అల్లు అర్జున్ కోసం రాబోతున్న సీఎం రేవంత్..? ఎప్పుడు ఎక్కడ?

ఈ పెళ్ళిలో అల్లు అర్జున్ సీఎం రేవంత్ ఒకే ఫ్రేమ్ లో కనిపించారు. (Allu Arjun)

  • Published On : March 8, 2026 / 09:37 PM IST

Allu Arjun

Allu Arjun : మరోసారి అల్లు అర్జున్ సీఎం రేవంత్ రెడ్డి ఒకే చోట కలిసి కనిపించబోతున్నారు. ఇటీవలే సీఎం రేవంత్ అల్లు శిరీష్ పెళ్ళికి హాజరయిన సంగతి తెలిసిందే. ఈ పెళ్ళిలో అల్లు అర్జున్ సీఎం రేవంత్ ఒకే ఫ్రేమ్ లో కనిపించారు.

అల్లు ఫ్యామిలీ ఎంతో ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ శివార్లలోని కోకాపేటలో అల్లు సినిమాస్ మల్టీప్లెక్స్ థియేటర్ ని కడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ థియేటర్ పూర్తయింది. ఇటీవలే పలువురు దర్శకులు, అల్లు అర్జున్, పలువురు సినీ ప్రముఖులు వచ్చి ఈ థియేటర్ ని పరిశీలించారు.

Also Read : Tejaswini Vygha : చీరకట్టులో దిల్ రాజు భార్య తేజస్విని వ్యాఘ క్యూట్ పోజులు..

మార్చ్ 12న అల్లు సినిమాస్ థియేటర్ గ్రాండ్ గా ఓపెన్ కానుంది. ఈ ఓపెనింగ్ కి సీఎం రేవంత్ రెడ్డి గెస్ట్ గా హాజరు కానున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే అల్లు ఫ్యామిలీ సీఎం రేవంత్ ని ఆహ్వానించినట్టు సమాచారం. సీఎం రేవంత్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు, అల్లు ఫ్యామిలీ అంతా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.

దీంతో మరోసారి అల్లు అర్జున్, సీఎం రేవంత్ రెడ్డి ఒకే ఫ్రేమ్ లో కనిపించబోతున్నారు. ఇక అల్లు సినిమాస్ ని మార్చ్ 12 ఓపెన్ చేసినా మార్చ్ 18న ధురంధర్ 2 ప్రీమియర్స్, మార్చ్ 19న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలతో ప్రారంభించనున్నారు.

Also Read : Gautam Ghattamaneni : మహేష్ తనయుడి కొత్త షార్ట్ ఫిలిం చూశారా? గౌతమ్ ఎలా నటించాడో చూడండి..