Arjun Leela : ఆహాలో అల్లు అర్జున్, శ్రీలీల సందడి ఏంటో తెలిసిపోయింది.. సిరీస్, మూవీ..

అల్లు అర్జున్, శ్రీలీల కలిసి త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఆహా ఒరిజినల్ కంటెంట్ తో రాబోతున్నారు అంటూ ఆహా టీం పోస్టులు పెట్టుకుంటూ వచ్చిన సంగతి తెలిసిందే. అసలు అది మూవీనా? వెబ్ సిరీసా? లేక ప్రమోషన్ యాడా? అని తెలియక అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. తాజాగా..

Allu Arjun and Sreeleela promotion video for aha under trivikram direction

Allu Arjun – Sreeleela : ఇటీవల తెలుగు ఓటీటీ ఆహా (Aha) చేసిన కొన్ని పోస్టులు అందరిలో ఆసక్తిని రేకేతించింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఎనర్జిటిక్ హీరోయిన్ శ్రీలీల కలిసి స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఆహా ఒరిజినల్ కంటెంట్ తో మీ ముందుకు రాబోతున్నారు అంటూ పోస్టులు పెట్టుకుంటూ వచ్చారు. అసలు అది మూవీనా? వెబ్ సిరీసా? లేక ప్రమోషన్ యాడా? అని తెలియక అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. ఇక నిన్న (జూన్ 15) ఒక చిన్న గ్లింప్స్ రిలీజ్ చేసి ప్రేక్షకుల్లో మరింత క్యూరియాసిటీని కలగజేశారు.

Adipurush : నేపాల్‌లో ఆదిపురుష్ వివాదం.. డైలాగ్ తీసేయాలంటూ నేపాల్ నేతలు.. అసలు ఏమైంది?

తాజాగా నేడు ఆ ఒరిజినల్ కంటెంట్ ఏంటో చెప్పేస్తూ వీడియో రిలీజ్ చేశారు. ఆహాలోని సిరీస్, మూవీస్, షోస్ గురించి ఒక ప్రమోషన్ వీడియో చేశారు. ఈ వీడియోని చాలా ఎంటర్‌టైనింగ్ గా తెరకెక్కించాడు త్రివిక్రమ్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. కాగా ఆహా వరుస సక్సెస్ ఫుల్ షోలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ వన్ ఓటీటీగా దూసుకుపోతుంది. బాలకృష్ణ (Balakrishna) అన్‌స్టాపబుల్ షోతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వ్యూయర్ షిప్‌ని సొంతం చేసుకున్న ఆహా.. తెలుగు ఇండియన్ ఐడల్ (Telugu Indian Idol) కి కూడా మంచి స్పందన అందుకుంది.

Allu Arjun : బాలీవుడ్ స్టార్ హీరోలతో బన్నీ.. హృతిక్‌కి హగ్ ఇస్తూ బాలీవుడ్ పెళ్ళిలో అల్లు అర్జున్ సందడి..

ఇటీవలే ఈ షో సెకండ్ సీజన్ బాలకృష్ణతో మొదలయ్యి అల్లు అర్జున్ తో గ్రాండ్ గా ఎండ్ అయ్యి మొదటి సీజన్ కంటే సూపర్ హిట్టుగా నిలిచింది. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఆహా ఓటీటీ మొదలైన సంగతి తెలిసిందే. అక్కడ కూడా కామెడీ అండ్ గేమ్ షోలతో పాటు క్రైమ్ సిరీస్ తో ఆడియన్స్ ని అలరిస్తుంది. ఇక సౌత్ లో మిగిలిన రెండు రాష్ట్రాల్లో కూడా ఆహా త్వరలోనే అడుగుపెట్టనుంది. అల్లు అర్జున్ కి కేరళలో భారీ క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ముందుగా అక్కడ ఆహా లాంచ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.