AAA Cinemas: సినిమాల్లోనే కాదు.. బిజినెస్‌లోనూ తగ్గేదేలే.. వైజాగ్‌లో అల్లు అర్జున్ కొత్త అడుగు
వైజాగ్ లోని ఇనార్బిట్ మాల్ లో 'ఏఏఎ సినిమాస్(AAA Cinemas)' మల్టీప్లెక్స్ ఓపెన్ చేయనున్న అల్లు అర్జున్.
- V Santhosh Kumar
- Published On : March 18, 2026 / 09:30 AM IST
Allu Arjun another AAA Cinemas multiplex at Inorbit Mall in Vizag.
- అల్లు అర్జున్ మరో మల్టీప్లెక్స్
- వైజాగ్ లో 8 స్క్రీన్స్ తో కొత్త థియేటర్
- త్వరలోనే ఓపెనింగ్
AAA Cinemas: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ కేవలం వెండితెరకే పరిమితం కాకుండా, వ్యాపార రంగంలోనూ దూసుకుపోతోంది. టాలీవుడ్ టాప్ హీరోగా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తున్న ఆయన, థియేటర్ల బిజినెస్ లోనూ తనదైన మార్క్ చూపిస్తున్నాడు. ఇప్పటికే హైదరాబాద్‌లో ‘AAA సినిమాస్(AAA Cinemas)’ పేరుతో అత్యాధునిక మల్టీప్లెక్స్‌ను ప్రారంభించి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించిన సంగతి తెలిసిందే.
అలాగే, ఇటీవలే ‘అల్లు సినిమాస్’ పేరుతో భారీ మల్టీప్లెక్స్ ను కూడా నిర్మించాడు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా ప్రారంభమైన ఈ మల్టీప్లెక్స్ ఇటీవలే ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. అయితే, ఇప్పుడు ఐకాన్ స్టార్ తన సినీ వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం ప్రేక్షకులకు తీపి కబురు అందించారు. వైజాగ్ సిటీ పర్యాటక పరంగానే కాకుండా, సినిమా మార్కెట్ పరంగానూ అత్యంత కీలకంగా మారిన విషయం తెలిసిందే.
Taapsee Pannu: ఆ హీరో రిజెక్ట్ చేయడం బాధకలిగించింది.. ఒక సినిమా చేశాక కూడా ఆలా చేస్తాడని అనుకోలేదు
అందుకే, అక్కడ భారీ స్థాయిలో మరో మల్టీప్లెక్స్‌ను అల్లు అర్జున్ సిద్ధం చేస్తున్నారు. విశాఖలోని ప్రముఖ ‘ఇనార్బిట్ మాల్’లో ఈ సరికొత్త ఏఏఏ సినిమాస్ అందుబాటులోకి రానుంది. ఒకటి రెండు కాకుండా, ఏకంగా 8 స్క్రీన్లతో ఈ మల్టీప్లెక్స్‌ను నిర్మిస్తుండటం విశేషం. ప్రపంచ స్థాయి సౌండ్ సిస్టమ్, విజువల్ క్వాలిటీ, విలాసవంతమైన సీటింగ్ సౌకర్యాలతో ఈ థియేటర్లు అందుబాటులోకి రానున్నాయి. సినిమా చూసే అనుభవాన్ని మరో స్థాయికి తీసుకెళ్లేలా ఈ ఎనిమిది స్క్రీన్లను తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం ఈ మల్టీప్లెక్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే దీనిని ఘనంగా ప్రారంభించనున్నారని సమాచారం.
సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం అల్లు అర్జున్ తమిళ దర్శకుడు అట్లీతో హాలీవుడ్ రేంజ్ సినిమా చేస్తున్నాడు. భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా తరువాత అల్లు అర్జున్ మరో తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో జతకడుతున్నాడు. ఈ పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది.
