Allu Arjun AA22: అల్లు అర్జున్ అట్లీ సినిమా టైటిల్ వచ్చేసింది.. బన్నీ బర్త్ డే ఫ్యాన్స్ కి ట్రీట్..

నేడు ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ సినిమా టైటిల్ ని అధికారికంగా ప్రకటించారు. (Allu Arjun)

  • Published On : April 8, 2026 / 11:07 AM IST

Raaka Allu Arjun Atlee AA22A6 Movie Titlle

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2తో పాన్ ఇండియా ఫేమ్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు తమిళ ద‌ర్శ‌కుడు అట్లీ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో సైన్స్ ఫిక్షన్ సినిమా చేస్తున్నాడు అల్లు అర్జున్. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలయింది. ఈ సినిమా నుంచి కాన్సెప్ట్ వీడియోలు కూడా రిలీజ్ చేసారు.

AA22xA6 అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీపికా పదుకోన్ తో పాటు మరింతమంది హీరోయిన్స్ ఈ సినిమాలో నటిస్తున్నారని సమాచారం. హాలీవుడ్ సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు పని చేస్తున్నారు. నేడు ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ సినిమా టైటిల్ ని అధికారికంగా ప్రకటించారు.

Also Read : AAA.. అఖిల్, అల్లు అర్జున్, అకిరా నందన్.. ముగ్గురి బర్త్ డేలు ఇవాళే..

అల్లు అర్జున్ – అట్లీ కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘రాకా’ అనే టైటిల్ ని ప్రకటించారు. దీంతో ఈ టైటిల్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. ఈ టైటిల్ తో సినిమాపై మరింత అంచనాలు నెలకొన్నాయి. టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేసారు. ఈ లుక్ లో అల్లు అర్జున్ గుండుతో జంతువు శరీరంతో పెద్ద పెద్ద గోర్లతో కనిపించారు. దీంతో ఈ కొత్త లుక్ వైరల్ గా మారింది. 2027లో ఈ సినిమా రిలీజ్ కానుంది.