Allu Arjun Basil Joseph : బన్నీ – బసిల్ జోసెఫ్ సినిమా టైటిల్ అదేనా..? ఈ దెబ్బతో మలయాళ ఇండస్ట్రీ షేక్ అవడం ఖాయం..
తాజాగా అల్లు అర్జున్ మలయాళ హీరో, దర్శకుడు బేసిల్ జోసెఫ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడని అంతా ఫిక్స్ అయిపోయారు. (Allu Arjun Basil Joseph)
- Saketh U
- Updated on- July 15, 2026 / 04:59 PM IST
Allu Arjun Basil Joseph
Allu Arjun Basil Joseph : అల్లు అర్జున్ పుష్ప తర్వాత అన్ని పాన్ ఇండియా సినిమాలు సెట్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అట్లీ తో రాకా సినిమా చేస్తున్నాడు బన్నీ. అది అయిన తర్వాత లోకేష్ కనగరాజ్ తో సినిమా ప్రకటించాడు. సందీప్ రెడ్డి వంగ తో కూడా సినిమా ప్రకటించాడు కానీ అది ఇప్పట్లో ఉండేలా లేదు. అయితే తాజాగా అల్లు అర్జున్ మలయాళ హీరో, దర్శకుడు బేసిల్ జోసెఫ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడని అంతా ఫిక్స్ అయిపోయారు.
గత కొన్నాళ్లుగా ఈ కాంబో వినిపిస్తుంది. అల్లు శిరీష్ పెళ్ళికి బసిల్ జోసెఫ్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ వీరి కాంబోలో సినిమా ఫిక్స్ అనుకున్నారు. నిన్న బసిల్ జోసెఫ్ ఐకాన్ అని రాసి ఉన్న ఓ క్యాప్ ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేసి రింగ రింగ సాంగ్ ని యాడ్ చేయడంతో వీళ్లిద్దరి సినిమా ఫిక్స్ అని అంతా అనుకుంటున్నారు.
అయితే బసిల్ జోసెఫ్ – అల్లు అర్జున్ కాంబో సినిమాకు టైటిల్ కూడా ‘ఐకాన్’ అనే ఉండబోతుందని సమాచారం. గతంలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఐకాన్ అనే సినిమా అనౌన్స్ చేసారు కానీ అది ఆగిపోయింది. ఆ టైటిల్ రిజిస్ట్రేషన్ మాత్రం ఇంకా అల్లు అర్జున్ దగ్గరే ఉందట. అలాగే బన్నీ స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా పేరు మార్చుకున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా వైడ్ తన ఫేమ్ ఇంకా పెంచుకోవాలని అల్లు అర్జున్ పుష్ప 2 నుంచి ప్రయత్నిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.
ఈ క్రమంలో ఐకాన్ అనే టైటిల్ పెడితే తన ఐకాన్ స్టార్ కూడా దేశమంతా రిజిస్టర్ అయిపోతుందని భావిస్తున్నారట. అందుకే బసిల్ జోసెఫ్ కూడా ఐకాన్ అనే టైటిల్ ఉన్న క్యాప్ ని షేర్ చేసాడని అంటున్నారు. మరి బసిల్ జోసెఫ్ – అల్లు అర్జున్ సినిమా టైటిల్ ఐకాన్ ఉంటుందా లేక ఇనేమైనా ఉంటుందా చూడాలి.
Also Read : Pawan Kalyan : డిశ్చార్జ్ అయిన డిప్యూటీ సీఎం.. చేతికట్టుతోనే ఇంటికి.. ఎమోషనల్ పోస్ట్ చేసిన పవన్ భార్య..
ఇక ఈ సినిమా రిలీజ్ అయితే మలయాళ ఇండస్ట్రీ మాత్రం షేక్ అవ్వడం ఖాయం. మలయాళ స్టార్ హీరోలకు ఎంత ఫేమ్ ఉందో అక్కడ అల్లు అర్జున్ కి కూడా అంతే ఫేమ్ ఉంది. ఇటీవల హ్యాపీ రీ రిలీజ్ కి అక్కడ థియేటర్స్ ఏ రేంజ్ లో దద్దరిల్లిపోయాయే వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇక బసిల్ జోసెఫ్ కూడా అక్కడ స్టార్ హీరో, దర్శకుడు. అతను అడిగితే మలయాళ స్టార్ హీరోలంతా ప్రమోషన్స్ కి వస్తారు. సో కచ్చితంగా బసిల్ జోసెఫ్ – బన్నీ సినిమా మలయాళ ఇండస్ట్రీలో కూడా రికార్డులు సృష్టించడం ఖాయం.
