Pawan Kalyan : డిశ్చార్జ్ అయిన డిప్యూటీ సీఎం.. చేతికట్టుతోనే ఇంటికి.. ఎమోషనల్ పోస్ట్ చేసిన పవన్ భార్య..
ఈ విషయాన్ని పవన్ భార్య అన్నా లెజినోవా పలు ఫోటోలు షేర్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.(Pawan Kalyan)
Pawan Kalyan
Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో భుజానికి ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. దీంతో గత 4 రోజుల నుంచి పవన్ అక్కడే హాస్పిటల్ లో ఉంటూ చికిత్స తీసుకున్నారు. నేడు ఉదయం పవన్ డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని పవన్ భార్య అన్నా లెజినోవా పలు ఫోటోలు షేర్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
అన్నా లెజినోవా, పవన్ కళ్యాణ్ అక్కడ హాస్పిటల్ లో చికిత్స చేసిన డాక్టర్ తో దిగిన ఫోటోలను షేర్ చేసారు. ఆ డాక్టర్ కు ఆయన చిత్రపటాన్ని బహూకరించారు. డాక్టర్ కు పవన్, అన్నా లెజినోవా ధన్యవాదాలు తెలిపారు. పవన్ ఇంకా చేతికట్టుతోనే ఉన్నారు. పూర్తిగా తగ్గేవరకూ చేతికట్టు ఉంటుందని సమాచారం.
Also See : Pawan Kalyan : పవన్ డిశ్చార్జ్.. వైద్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు.. ఫోటోలు
ఈ ఫోటోలను షేర్ చేస్తూ అన్నా లెజినోవా.. ఈరోజు మేము ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాము, మా హృదయాలు కృతజ్ఞతతో నిండిపోయాయి. నా భర్త పట్ల అసాధారణమైన శ్రద్ధ తీసుకుని అత్యున్నత వృత్తి నైపుణ్యంతో ఆయనకు శస్త్రచికిత్స చేసిన అద్భుతమైన బృందానికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆయన అత్యంత ఉత్తమమైన చేతుల్లో ఉన్నారని మాకు తెలుసు. అది మా కుటుంబానికి వెలకట్టలేని మనశ్శాంతిని ఇచ్చింది. ఈ చికిత్సలో పాల్గొన్న డా. దిన్షా పర్దివాలా – ఆర్థ్రోస్కోపీ సర్జన్, డా. శ్యామ్ సుందర్ గాంకర్ – సీనియర్ అనస్థీటిస్ట్, డా. హితేష్ యాదవ్ – అసిస్టెంట్ డాక్టర్, డా. అర్పిత ముతా – అసిస్టెంట్ డాక్టర్ ల నైపుణ్యానికి మాత్రమే కాకుండా, ఈ ప్రయాణమంతటా మీరు చూపిన దయ, అంకితభావం, కరుణకు ధన్యవాదాలు. మేము ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటాము అని తెలిపింది.
View this post on Instagram
