Allu Arjun emotional post about Mega family.
Allu Arjun: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన మరోసారి తల్లిదండ్రులైనా విషయం తెలిసిందే. జనవరి 31న ఉపాసన కవలలకు జన్మనించింది. వారిలో ఒకరు పాప, ఒక బాబు అవడంతో మెగా ఫ్యామిలీలో ఆనందాలు వెల్లువెత్తాయి. కొణిదెల, కామినేని కుటుంబాలలో సంబరాలు అంబరాన్ని అంటాయి. ఇక మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. మెగా ఫ్యామిలీకి వారసుడు వచ్చాడు అంటూ సోషల్ మీడియాలో పోస్టులో పెడుతున్నారు.
Shivani Nagaram: కలర్ కలర్ డ్రెస్సులో కలర్ ఫుల్ చిలకలా.. శివాని నాగారం క్యూట్ ఫొటోలు
ఇక ప్రముఖులు సైతం రామ్ చరణ్- ఉపాసన దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) సైతం అపోలో హాస్పిటల్స్ కి వెళ్లి చిన్నారులు చూసి వచ్చారు. అంతేకాదు, సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. “మరోసారి తల్లిదండ్రులైన రామ్ చరణ్, ఉపాసనలకు నా హృదయపూర్వకమైన అభినందనలు తెలుపుతున్నాను.
ఈ వార్త నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. చిరంజీవి గారి ముఖంలో, మా చిట్టికా ముఖంలో ఆనందం, గర్వం, సంతోషం కనిపిస్తున్నాయి. మెగా ఫ్యామిలీ అంతా ఇలా సంతోషంగా ఉండటం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది” అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశాడు అల్లు అర్జున్. దీంతో అల్లు అర్జున్ చేసిన ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక అల్లు అర్జున్ ఇలా ఎమోషనల్ గా పోస్ట్ పెట్టడంతో మెగా, అల్లు అభుమానులు సైతం ఎమోషనల్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది.
Congratulations to @AlwaysRamCharan & @upasanakonidela on being wonderful parents once again. Immense joy and celebration all around. The pride and happiness are radiating on @KChiruTweets garu’s face and Chittika’s as well. So happy to see them and the entire family’s smiling…
— Allu Arjun (@alluarjun) February 2, 2026