Pushpa 2 : పుష్ప 2 టీజర్‌ని.. ఈ బుడ్డోళ్లు సూపర్‌గా రీ క్రియేట్ చేశారు.. చూస్తే వావ్ అంటారు..

పుష్ప 2 టీజర్‌ని మళ్ళీ రీ క్రియేట్ చేసిన బుడ్డోళ్లు. ఆ టీజర్ ని చూస్తే మీరు వావ్ అంటారు.

Pushpa 2 : సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ పుష్ప 2. ఫస్ట్ పార్ట్ కి వచ్చిన క్రేజ్ తో ఈ సీక్వెల్ పై పాన్ ఇండియా వైడ్ భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ సెకండ్ పార్ట్ నుంచి ఎటువంటి కంటెంట్ బయటకి వచ్చినా.. అది నెట్టింట వైరల్ గా మారిపోతుంది. ఇక ఇటీవల ఈ మూవీ నుంచి మేకర్స్.. టీజర్ ని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

కేవలం ఒక నిమిషం పాటు ఉన్న ఈ టీజర్ యూట్యూబ్ లో రికార్డులు సృష్టించింది. అసలు ఎటువంటి డైలాగ్స్ లేకుండానే, కేవలం అమ్మోరు గెటప్ లో అల్లు అర్జున్ స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆడియన్స్ కి గూస్‌బంప్స్ తెప్పించారు. అభిమానులకు అయితే ఈ టీజర్ పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. ఇక ఈ ఇష్టంతోనే ఆ టీజర్ ని రీ క్రియేట్ చేస్తూ ఓ వీడియో చేశారు. ఒరిజినల్ టీజర్ ని ఎలా కట్ చేసారో.. సేమ్ అలాగే చిన్నపిల్లలతో ఓ టీజర్ ని రీ క్రియేట్ చేశారు.

Also read : Premalu 2 : చిన్న సినిమాల సీక్వెల్స్ సందడి.. ప్రేమలు 2 కూడా వచ్చేస్తుంది..

ఇక ఈ టీజర్ నెట్టింట వైరల్ అయ్యి పుష్ప టీం వరకు వెళ్ళింది. దీంతో చిత్ర యూనిట్ రియాక్ట్ అవుతూ.. ఆ టీజర్ ని ట్వీట్ చేస్తూ వారిని అభినందించారు. ఈ రీ క్రియేషన్ కి నెటిజెన్స్ నుంచి కూడా సూపర్ రెస్పాన్స్ వస్తుంది. మరి ఆ సూపర్ రీ క్రియేషన్ టీజర్ ని మీరుకూడా చూసేయండి.

కాగా ఈ మూవీని ఆగష్టు 15న రిలీజ్ చేయబోతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతున్న ఈ చిత్రానికి బాక్స్ ఆఫీస్ వద్ద ఎటువంటి పోటీ కనిపించడం లేదు. టాలీవుడ్ టు బాలీవుడ్ ఏ పెద్ద సినిమా.. ఆ సమయంలో రిలీజ్ అవ్వడం లేదు. ఈ విషయం పుష్ప కలెక్షన్స్ కి బాగా కలిసొస్తుంది. మరి పుష్ప బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తాడో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు