×
Ad

Allu Arjun: 15 ఏళ్ళ బంధం.. పెళ్లిరోజున భార్యకు బెంజ్ కారు గిఫ్ట్.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

పెళ్లి రోజున తన భార్యకు బెంజ్ కారు బహుమతిగా ఇచ్చిన అల్లు అర్జున్(Allu Arjun).

Allu Arjun gifted a Benz car to his wife on their wedding day

  • పెళ్లిరోజున భార్యకు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన అల్లు అర్జున్
  • ఖరీదైన కారును గిఫ్టుగా ఇచ్చిన ఐకాన్ స్టార్
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డికి ఖరీదైన బహుమతి ఇచ్చాడు. 15వ పెళ్లిరోజు సందర్భంగా కాస్ట్లీ బెంజ్ కారును గిఫ్ట్‌గా ఇచ్చాడు. దీనికి సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మార్చి 6 అల్లు అర్జున్- స్నేహారెడ్డి పెళ్లిరోజు. వీరి పెళ్లి బంధానికి సరిగా 15 ఏళ్ళు. ఈ అద్భుతమైన క్షణం మరింత అద్భుతంగా ఉండాలని భావించిన అల్లు అర్జున్ తన భార్యకు కారును గిఫ్ట్ గా ఇచ్చాడు.

Vijay Deverakonda: రిస్క్ చేస్తున్న విజయ్ దేవరకొండ.. ఈ టైంలో ఆ డైరెక్టర్ తో అవసరమా?

ఇక వీరి పెళ్లి విషయానికి వస్తే, 2011 మార్చి 6న స్నేహ రెడ్డి మేడలో మూడుముళ్లు వేశాడు అల్లు అర్జున్(Allu Arjun). ఈ జంటకు కొడుకు అయాన్, కూతురు అర్హ ఉన్నారు. అల్లు అర్జున్ తన భార్యకు కారును గిఫ్టుగా ఇవ్వడంతో ఆ కారుకు సంబందించిన డీటెయిల్స్, దాని ధర తెలుసుకోవడానికి నెటిజన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. అల్లు అర్జున్ గిఫ్టుగా ఇచ్చింది బెంజ్ ఏఎమ్‌జీ మోడల్ కారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఈ మోడల్ కారు ధర దాదాపు రూ.4 నుంచి 5 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ న్యూస్ తెలిసి నెటిజన్స్ నోరెళ్లబెడుతున్నారు.

ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే, ప్రస్తుతం ఆయన తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా తరువాత, మరో తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్‌తో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అల్లు అర్జున్. దీనికి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ఇప్పటికే మొదలయ్యాయి.