National Film Awards 2023 : బెస్ట్ యాక్టర్‌గా అల్లు అర్జున్‌కి నేషనల్ అవార్డు.. పుష్ప తగ్గేదేలే..
పుష్ప సినిమాకు గాను అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్‌గా నేషనల్ అవార్డు అందుకున్నాడు.
- gum 95921
- Updated on- August 24, 2023 / 07:36 PM IST
Allu Arjun got national award for Pushpa 1 in 69 National Film Awards 2023
National Film Awards 2023 : ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన వచ్చేసింది. ఈ ఏడాదిలో తెలుగు నుంచి సూపర్ హిట్ పాన్ ఇండియా సినిమాలు ఉండడంతో.. టాలీవుడ్ యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ మధ్యనే గట్టి పోటీ కనబడింది. ఈక్రమంలోనే బెస్ట్ యాక్టర్ రేసులో.. RRR నుంచి రామ్ చరణ్ (Ram Charan), ఎన్టీఆర్ (NTR), పుష్ప నుంచి అల్లు అర్జున్ (Allu Arjun) వంటి స్టార్స్ ఉండడంతో ఉత్కంఠ మరింత పెరిగిపోయింది.
National Film Awards 2023 : RRR కి నేషనల్ అవార్డ్స్ పంట.. తెలుగు విజేతలు వీరే..
ఇక ఉత్కంఠ పోరులో పుష్ప తన విజయ పతాకం ఎగురవేశాడు. పుష్ప సినిమాలో తన నటనతో తగ్గేదేలే అంటూ అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కర్ని మైమరపించింది. ఒక రీజనల్ సినిమాగా వచ్చిన ఈ చిత్రం అల్లు అర్జున్ మ్యానరిజమ్స్ అండ్ డైలాగ్స్ తో గ్లోబల్ వైడ్ పాపులారిటీని సంపాదించుకుంది. కేవలం ఆడియన్స్ మాత్రమే కాదు, సినీ అండ్ స్పోర్ట్స్ సెలబ్రిటీస్ కూడా పుష్ప మ్యానరిజమ్స్ అనుసరించేలా అల్లు అర్జున్ చేశాడు. ఇక తన యాక్టింగ్ కి ప్రపంచవ్యాప్తంగా ఇంతటి అభిమానం అందుకున్న అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు రాకుండా ఉంటుందా.
నేడు కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ 2021 గాను నేషనల్ అవార్డులు ప్రకటించగా, ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ పేరుని అనౌన్స్ చేసింది. పుష్ప ది రైస్ సినిమాకు గాను ఈ అవార్డుని బన్నీకి ప్రకటించారు. ఇక నేషనల్ అవార్డు రావడంతో అల్లు అర్జున్ ఇంట వద్ద పండుగా వాతావరణం కనిపిస్తుంది. ఇండస్ట్రీ, అభిమానులు నుంచి అల్లు అర్జున్ కి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఇదే సినిమాకి దేవిశ్రీప్రసాద్ కూడా బెస్ట్ మ్యూజిక్ డైరెక్ట్ గా అవార్డుని అందుకున్నాడు.
