National Film Awards 2023 : RRR కి నేషనల్ అవార్డ్స్ పంట.. తెలుగు విజేతలు వీరే..

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టెక్నీషియన్స్ అండ్ యాక్టర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2023 విజేతల లిస్ట్ వచ్చేసింది.

National Film Awards 2023 : RRR కి నేషనల్ అవార్డ్స్ పంట.. తెలుగు విజేతలు వీరే..

National Film Awards 2023 for RRR Uppena details in telugu

Updated On : August 24, 2023 / 7:45 PM IST

National Film Awards 2023 : 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతల లిస్ట్ వచ్చేసింది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టెక్నీషియన్స్ అండ్ యాక్టర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డులు భారతీయ ప్రభుత్వం అందించే ఈ పురస్కారం. ఇక ఈ ఏడాది విజేతలుగా నిలిచిన వారి లిస్ట్ ని కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 2021 లో సెన్సార్ అందుకున్న సినిమాలు 69వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ బరిలో నిలిచాయి. వాటిలో RRR, పుష్ప ది రైజ్ (Pushpa The Rise), జై భీమ్, మిన్నల్ మురళి, 83, సర్దార్ ఉదం, మిన్నల్ మురళి, షేర్షా, ది గ్రేట్ ఇండియన్ కిచెన్, నాయట్టు మరియు గంగూబాయి కతియావాడి వంటి చిత్రాలు అవార్డుల కోసం పోటీ పడ్డాయి. ఈసారి తెలుగు సినిమాలకు అవార్డుల పంట పండింది.

Naresh-Pavitra : పవిత్రతో నరేష్ పెళ్లిపై కొడుకు నవీన్ రియాక్షన్.. బయట చాలామంది..

బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ – ఉప్పెన

బెస్ట్ పాపులర్ ఫిల్మ్ – RRR

బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్ – పురుషోత్తమ చార్యులు

బెస్ట్ యాక్టర్ – అల్లు అర్జున్ (పుష్ప‌)

బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ – దేవిశ్రీప్రసాద్ (పుష్ప), కీరవాణి (RRR)

ఉత్తమ గాయకుడు – కాలభైరవ (కొమరం భీముడో – RRR)

బెస్ట్ లిరిక్స్ – చంద్రబోస్ (కొండపోలం మూవీ)

బెస్ట్ స్టంట్ మాస్టర్ – కింగ్ సోలొమాన్ (RRR)

బెస్ట్ డాన్స్ కొరియోగ్రాఫర్ – ప్రేమ్ రక్షిత్ (RRR)

బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ – వి శ్రీనివాస్ మోహన్ (RRR)