Allu Arjun : బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి బయలుదేరిన బన్నీ.. పుష్ప స్క్రీనింగ్..?

అల్లు అర్జున్‌కు బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ నుండి ప్రత్యేక ఆహ్వానం అందింది. ఈ ఫెస్టివల్‌లో పుష్ప సినిమా ప్రత్యేక ప్రదర్శన ఉంటుందని తెలుస్తోంది.

Allu Arjun

Allu Arjun : అల్లు అర్జున్ బెర్లిన్ ప్రయాణమయ్యారు. అక్కడ జరగనున్న ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొంటున్నారు. ఈ వేడుకలో పుష్ప: ది రైజ్ ప్రత్యేక ప్రదర్శన ఉంటుందని తెలుస్తోంది.

Sivakarthikeyan : శివ కార్తికేయన్‌తో సినిమా అనౌన్స్ చేసిన మురుగదాస్.. ఈసారైనా..!

అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ప: ది రైజ్’ మూవీ సూపర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం ‘పుష్ప: ది రూల్’ సెకండ్ పార్ట్ రెడీ అవుతోంది. అయితే పుష్ప ఫస్ట్ పార్ట్ రష్యా, USA, గల్ఫ్, ఆస్ట్రేలియా, UK లతో పాటు పలు దేశాల్లో కూడా రిలీజై విజయం సాధించింది. రష్మిక మందన్న, సమంత, ఫహద్ ఫాసిల్ నటించిన ఈ సినిమా విపరీతమైన జనాదరణ సంపాదించుకుంది.

Rajendra Prasad : 65ఏళ్ళ వయసులో ఆ హీరోయిన్‍‌తో.. రాజేంద్ర ప్రసాద్ ప్రేమాయణం..

కాగా బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరు కావాల్సిందిగా  బన్నీకి ప్రత్యేకంగా ఆహ్వానం అందింది. ఈ ఫెస్టివల్‌లో పుష్ప సినిమా ప్రత్యేక ప్రదర్శన ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బన్నీ హైదరాబాద్ నుండి బెర్లిన్‌కు బయలుదేరుతూ ఎయిర్‌పోర్టులో కనిపించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ పర్యటనలో అల్లు అర్జున్ పలువురు అంతర్జాతీయ సినీ ప్రముఖులను కలవబోతున్నారు.

ట్రెండింగ్ వార్తలు