Rajendra Prasad : 65ఏళ్ళ వయసులో ఆ హీరోయిన్‍‌తో.. రాజేంద్ర ప్రసాద్ ప్రేమాయణం..

65ఏళ్ళ వయసులో ఆ హీరోయిన్‍‌తో ప్రేమాయణం అంటూ రాజేంద్ర ప్రసాద్..

Rajendra Prasad : 65ఏళ్ళ వయసులో ఆ హీరోయిన్‍‌తో.. రాజేంద్ర ప్రసాద్ ప్రేమాయణం..

Rajendra Prasad made love with senior heroine at 65 age

Updated On : February 15, 2024 / 3:55 PM IST

Rajendra Prasad : టాలీవుడ్ సీనియర్ హీరోల్లో ఫుల్ ఫార్మ్‌లో ఉన్న నటుడు అంటే.. రాజేంద్ర ప్రసాద్ అని చెప్పడంలో ఏ సందేహం లేదు. స్టార్ హీరో సినిమాల్లో ముఖ్య పాత్రలు చేస్తూనే, మెయిన్ లీడ్ లో కూడా పలు సినిమాలు చేస్తూ ముందుకు దూసుకు పోతున్నారు. థియేటర్ కంటెంట్ నుంచి ఓటీటీ వరకు అన్ని కవర్ చేస్తూ ఇప్పటి జనరేషన్ ఆడియన్స్ ని కూడా అలరిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం రాజేంద్ర ప్రసాద్ లీడ్ రోల్ లో చేస్తున్న సినిమాలు మూడు ఉన్నాయి.

వాటిలో ఒకటి ‘షష్టిపూర్తి’, మరొకటి ‘లగ్గం’. తాజాగా మూడో సినిమాని కూడా అనౌన్స్ చేశారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. ఇక ఈ చిత్రానికి ‘లవ్@65’ అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ తో పాటు లీడ్ రోల్‌లో.. అలనాటి హీరోయిన్ జయప్రద నటించబోతున్నారు. సినిమా కథంతా.. వీరిద్దరి ప్రేమ చుట్టూనే తిరగబోతుందని తెలుస్తుంది. కాగా వీరితో పాటు ఈ సినిమాలో కార్తీక్ రాజు, సునీల్, అజయ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

Also read :Yash : తన అసిస్టెంట్ ఇంటికి వెళ్లి సర్‌ప్రైజ్ ఇచ్చిన రాఖీ భాయ్

ఇక ఈ చిత్రాన్ని వి ఎన్ ఆదిత్య డైరెక్ట్ చేస్తున్నారు. ఈ దర్శకుడు మనసంతా నువ్వే, నేనున్నాను, ఆట వంటి సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించారు. ఈ మూడు చిత్రాల్లోని లవ్ స్టోరీస్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు లవ్@65 సినిమాలోని లవ్ స్టోరీతో కూడా ఆడియన్స్ ని అలానే ఆకట్టుకోనున్నారని తెలుస్తుంది. ఇక లవబుల్ మూవీకి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండడం మరో విశేషం. ఆల్రెడీ షూటింగ్ కూడా మొదలు పెట్టుకున్న ఈ చిత్రం నుంచి నేడు ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. త్వరలోనే విడుదల తేదీ పై కూడా ప్రకటన చేయనున్నారు.