Yash : తన అసిస్టెంట్ ఇంటికి వెళ్లి సర్‌ప్రైజ్ ఇచ్చిన రాఖీ భాయ్
రాకింగ్ స్టార్ యష్ ఇటీవల తన అసిస్టెంట్ ఇంటికి వెళ్లి ఇచ్చిన సర్‌ప్రైజ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యష్ వ్యక్తిత్వంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Yash
Yash : KGF2 హిట్ తర్వాత రాకింగ్ స్టార్ యష్ ‘టాక్సిక్’ మూవీతో వస్తున్నారు. ఈ సినిమా పనులతో బిజీగా ఉన్నప్పటికీ యష్ తన వ్యక్తిత్వాన్ని చాటుకున్నారు. అసిస్టెంట్ ఇంటికి వెళ్లి ఒక సర్‌ప్రైజ్ ఇచ్చారు.
Devara Update : దేవరలో ఇంకా నాలుగు పాటలు పెండింగ్.. యాక్షన్ ఎపిసోడ్స్ షూటింగ్ అయిపోయిందా?
KGF2 తర్వాత యష్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమాకి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాకి యష్ సహ నిర్మాతగా కూడా మారినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా పట్ల జనాల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఓవైపు సినిమాలతో బిజీగా ఉన్నా తన దగ్గర పనిచేసే వారి పట్ల ఎంతో కృతజ్ఞతా భావంతో ఉంటారు యష్.. ఎవరైనా కష్టంలో ఉన్నారన్నా కూడా తట్టుకోలేరు. అందుకే కన్నడ నాట యష్‌కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
Payal Rajput : వాలంటైన్స్ డే రోజు పబ్బులో ప్రియుడి తల పగలగొట్టిన నటి.. అసలు ఏం జరిగింది?
ఇటీవల యష్ అసిస్టెంట్‌కి బాబు పుట్టాడు. పనుల ఒత్తిడిలో యష్ ఈ విషయాన్ని పట్టించుకోలేదు. కాస్త గ్యాప్ తీసుకుని అసిస్టెంట్ ఇంటికి సర్‌ప్రైజ్‌గా వెళ్లడమే కాదు బాబుకి గోల్డ్ చైన్ గిఫ్ట్‌గా ఇచ్చారు. స్వయంగా బాబు మెడలో వేసి ఆశీర్వదించి వచ్చారు. అసిస్టెంట్ ఫ్యామిలీ సంతోషంలో మునిగిపోయింది. అంత పెద్ద స్టార్ అయినా యష్ సింప్లిసిటీని చూసి అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నాయి. యష్ తన అసిస్టెంట్ ఇంటికి వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Such a adorable video!#YashBOSS gifted a golden chain to his assistant’s child ?❤️#ToxicTheMovie @TheNameIsYash pic.twitter.com/QNZBvwKKOb
— RAANA™ (@Raana_Yash) February 11, 2024