Devara Update : దేవరలో ఇంకా నాలుగు పాటలు పెండింగ్.. యాక్షన్ ఎపిసోడ్స్ షూటింగ్ అయిపోయిందా?
దేవర సినిమాకి సంబంధించి ఇంకా 4 పాటల షూట్ పెండింగ్ ఉందట. మరి యాక్షన్ పార్ట్ సంగతి ఏంటి? అనుకున్న తేదీకి రిలీజ్ అవుతుందా?

Devara Update
Devara Update : ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కొరటాల డైరెక్షన్‌లో ఫుల్ మాస్ ఎంటర్టైనర్‌గా వస్తున్న ఈ సినిమా రెండు పార్టులుగా వస్తోంది. మొదటి పార్టు షూటింగ్ జరుపుకుంటున్న దేవరలో ఇంకా నాలుగు పాటలు షూటింగ్ పెండింగ్ ఉందట. ఇప్పటికే ఏప్రిల్ 5 రిలీజ్ డేట్ చెప్పిన టీమ్.. షూటింగ్ ఆలస్యమైతే మరో డేట్‌కి మార్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.
Payal Rajput : వాలంటైన్స్ డే రోజు పబ్బులో ప్రియుడి తల పగలగొట్టిన నటి.. అసలు ఏం జరిగింది?
దేవర మొదటి పార్ట్ ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేసారు మేకర్స్. ప్రస్తుతం సినిమా షూటింగ్ ఎంతవరకు వచ్చింది? యాక్షన్ పార్ట్ కంప్లీట్ అయ్యిందా? చెప్పిన డేట్‌కి సినిమా రిలీజ్ అవుతుందా? అని ప్రేక్షకుల్లో అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే దేవర షూటింగ్ వాయిదా పడి నెల రోజులు అవుతోంది. ఎట్టకేలకు వచ్చేవారం షూటింగ్ మొదలు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ పార్ట్‌కి సంబంధించిన ఫైట్స్, యాక్షన్ స్టంట్స్ షూటింగ్ కంప్లీట్ అయ్యిందట. టాకీలో ఇంకా కొంత పార్ట్ పూర్తి చేయాల్సి ఉందట. ఇప్పటివరకు ఒకే ఒక పాట మాత్రమే షూట్ చేసారట. ఎన్టీఆర్, జాన్వీ కపూర్‌పై డ్యూయెట్స్‌తో కలిపి నాలుగు పాటలు షూటింగ్ పెండింగ్ ఉందట.
Dunki : సడెన్‌గా ఓటీటీలోకి వచ్చి సర్‌ప్రైజ్ ఇచ్చిన షారుఖ్ ఖాన్ ‘డంకీ’.. ఏ ఓటీటీలో?
ఇంకా నాలుగు పాటలు షూటింగ్ పెండింగ్ అంటే ఏప్రిల్ 5 కి సినిమా రిలీజ్ కష్టం అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తుంటే వాయిదా అవకాశాలే కనిపిస్తున్నాయి. ఎన్టీఆర్ హీరోగా, జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా సైఫ్ అలీఖాన్ మెయిన్ విలన్‌గా నటిస్తున్నారు.