Payal Rajput : వాలంటైన్స్ డే రోజు పబ్బులో ప్రియుడి తల పగలగొట్టిన నటి.. అసలు ఏం జరిగింది?
వాలంటైన్స్ డే రోజు పాయల్ రాజ్‌పుత్ పబ్బులో గాజు గ్లాసుతో తన ప్రియుడి తల బద్దలు కొట్టిన వీడియో వైరల్ అవుతోంది. అసలు పబ్బులో ఏమైంది?

Payal Rajput
Payal Rajput : వాలంటైన్స్ డే ను సెలబ్రిటీలు సైతం గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ తన లవర్‌తో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చూపిస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసారు. ఆ వీడియోలో పాయల్ తన ప్రియుడి తల పగలగొడుతున్నట్లు కనిపించింది. అరే.. ఏమైందని? నెటిజన్లు షాకయ్యారు. అసలు పబ్బులో ఏం జరిగింది.
Anasuya : అనసూయ వాలెంటైన్స్ డే స్పెషల్ ఫొటోలు.. భర్తతో బీచ్‌లో
పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తన పర్సనల్ లైఫ్‌లో కూడా తన ప్రియుడు సౌరభ్‌తో పాయల్ చాలా హ్యాపీగా ఉన్నారు. పంజాబీ ఇండస్ట్రీలో మొదలైన వీరి పరిచయం ప్రేమకు దారి తీసింది. ఇద్దరు కలిసి అనేక ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేశారు. అయితే వాలంటైన్స్ డే రోజు పాయల్ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పబ్బులో గాజు గ్లాసుతో తన ప్రియుడి తల బద్దలు కొట్టినట్లుగా వీడియోలో కనిపించింది. ఈ వీడియోకి ‘నేను వాలంటైన్స్ డే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను.. మరి మీరు?..కింద కామెంట్ చేయండి’ అనే ట్యాగ్ లైన్ కూడా యాడ్ చేసారు. మొదట ఏం జరిగిందని? కంగారు పడిన వారంతా షూట్‌లో భాగమని తెలుసుకుని రిలాక్స్ అయ్యారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదంతా వీరిద్దరూ కలిసి చేస్తున్న ఒక వీడియో ఆల్బమ్‌లోని సీన్‌గా తెలుస్తోంది. దీనిపై పాయల్ ప్రియుడు సౌరభ్ ‘బ్యాడ్ ఐడియా’ అని కామెంట్ చేశాడు. వాలంటైన్స్ డే రోజు షూటింగ్స్‌తో బిజీనా అంటూ నెటిజన్లు స్పందించారు.
అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ నటించిన ‘మంగళవారం’ గతేడాది నవంబర్ 17న రిలీజై హిట్ టాక్ సొంతం చేసుకుంది. మంచి కలెక్షన్స్ రాబట్టింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజై మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. పాయల్ చేతిలో ప్రస్తుతం తెలుగు, తమిళ ప్రాజెక్టులు ఉన్నట్లు తెలుస్తోంది.
View this post on Instagram