Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. లోకేష్‌తో చేసేది తెలుగు సినిమా కాదా? డబ్బింగ్ సినిమానా?

అనుకున్నదే కానుందా. అల్లు అర్జున్(Allu Arjun) లోకేష్‌తో చేస్తున్నది తెలుగు సినిమా కాదాట. తమిళ్ లో చేసి తెలుగులోకి డబ్ చేస్తున్నారని టాక్.

Allu Arjun, Lokesh Kanagaraj movie will be filmed in Tamil and dubbed into Telugu.

  • లోకేష్‌తో సినిమా పక్కా తమిళ్.
  • షూటింగ్ అంతా అక్కడే జరుగుతుంది.
  • నిరాశలో అల్లు అర్జున్ అభిమానులు.

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం గ్లోబల్ స్థాయిలో తన మార్కెట్‌ను విస్తరించుకునే పనిలో ఉన్నారు. ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్న ఆయన, తన తదుపరి ప్రాజెక్టుల విషయంలో అత్యంత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే డైరెక్టర్ అట్లీతో ‘రాక’ సినిమా చేస్తున్న బన్నీ, కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌తో మరో సినిమాను ఫిక్స్ చేశాడు. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, ఈ ప్రాజెక్టుకు సంబంధించి వస్తున్న తాజా వార్తలు అల్లు అర్జున్ అభిమానుల్లో కొంత చర్చకు, ఆందోళనకు దారితీస్తున్నాయి.

Tollywood: టాలీవుడ్ నిర్మాతలకు డిజిటల్ మార్కెట్ దెబ్బ.. అంచనాలు తలకిందులు.. ఆశలు ఆవిరి

అదేంటంటే, అల్లు అర్జున్(Allu Arjun)- లోకేష్ సినిమా తెలుగు సినిమా కాదు, ఇది పక్కా తమిళ్ ప్రాజెక్టుగా రూపొందనుందని సమాచారం. సినిమా స్క్రిప్ట్ విషయంలో తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలకు చెందిన రచయితలు కలిసి పనిచేస్తున్నప్పటికీ, షూటింగ్ మొత్తం తమిళ్ లోనే జరగనుందట. ఈ భారీ సినిమాను నేరుగా తమిళ్‌లోనే తెరకెక్కించి, ఆ తర్వాత తెలుగుతో పాటు ఇతర భాషల్లోకి డబ్బింగ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. అల్లు అర్జున్ కెరీర్‌లో ఇది మొదటి పూర్తిస్థాయి తమిళ్ సినిమా కావడం విశేషం.

ఈ న్యూస్ తెలియడంతో అల్లు అర్జున్ తెలుగు అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. తమ అభిమాన హీరో నేరుగా తెలుగులో సినిమా చేయకుండా, తమిళ్ ప్రాజెక్టును ఎంచుకోవడం ఏమిటని డిజప్పాయింట్ అవుతున్నారు. డబ్బింగ్ వెర్షన్ కంటే స్ట్రెయిట్ తెలుగు సినిమా చూసినప్పుడు ఉండే ఆ అనుభూతి లోపిస్తుందని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ కాంబో సొంత భాషలో కాకుండా పరభాషలో మొదలవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరి నెట్టింట వైరల్ అవుతున్న ఈ న్యూస్ గురించి మేకర్స్ ఏవిధంగా స్పందిస్తారు అనేది చూడాలి.