అల్లు అర్జున్ కొత్త ఇల్లు – ‘బ్లెస్సింగ్’

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తను నిర్మించుకోబోయే కొత్త ఇంటికి ‘బ్లెస్సింగ్’ అనే పేరు పెట్టాడు.. భార్య, పిల్లలతో కలిసి భూమి పూజ కార్యక్రమం నిర్వహించాడు..

  • Publish Date - October 3, 2019 / 08:10 AM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తను నిర్మించుకోబోయే కొత్త ఇంటికి ‘బ్లెస్సింగ్’ అనే పేరు పెట్టాడు.. భార్య, పిల్లలతో కలిసి భూమి పూజ కార్యక్రమం నిర్వహించాడు..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరో కొత్త ఇంటికోసం ప్లాన్ చేసుకున్నాడు. ఖరీదైన ఇల్లు కోసం తన కుటుంబ సభ్యులతో కలిసి రీసెంట్‌గా భూమి పూజ కూడా చేశాడు. అందుకు సంబందించిన ఒక స్పెషల్ పిక్‌ని సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్నాడు.

అలాగే తను నిర్మించుకోబోయే కొత్త ఇంటికి ‘బ్లెస్సింగ్’ అనే పేరు కూడా పెట్టాడు బన్నీ.. భార్య, పిల్లలతో కలిసి భూమి పూజ కార్యక్రమం నిర్వహించిన పిక్‌ పోస్ట్ చెయ్యగానే సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.

Read Also : ఐశ్వర్యా రాయ్ వాయిస్‌తో ‘మలెఫిసెంట్ : మిస్ట్రెస్ ఆఫ్ ఈవిల్’

గతకొద్ది రోజులుగా ‘అల వైకుంఠపురములో’ షూటింగుతో బిజీగా ఉన్న బన్నీ… షెడ్యూల్ గ్యాప్ దొరకడంతో మంచి రోజు చూసి.. భూమి పూజ చేశాడు. తన టేస్ట్‌కి తగ్గట్టు లగ్జీరియస్‌గా ఇంటిని నిర్మించనున్నాడట.. త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న ‘అల వైకుంఠపురములో’ 2020 సంక్రాంతికి విడుదల కానుంది.