Pushpa 2 : పుష్ప 2 ‘పీలింగ్స్’ సాంగ్.. తెలుగులో అర్ధమేంటో తెలిసిపోయింది..

పుష్ప 2 వైల్డ్ ఫైర్ జాతర ఇప్పటినుండే స్టార్ట్ చేసారు.

Allu Arjun Pushpa 2 movie Feelings song meaning in Telugu

Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన తాజా సినిమా పుష్ప 2. డిసెంబరు 5న ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 సినిమా రిలీజ్‌ కానుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ నెక్స్ట్ లెవెల్ లో చేస్తున్నారు. పుష్ప 2 వరుస అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెడుతున్నారు. పుష్ప 2 వైల్డ్ ఫైర్ జాతర ఇప్పటినుండే స్టార్ట్ చేసారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలు, టీజర్, ట్రైలర్ నెట్టింట అదరగొడుతున్నాయి.

Also Read : Game Changer : అప్పుడే గేమ్ ఛేంజర్ నాలుగో సాంగ్.. ట్రైలర్ కూడా..అప్పుడేనా..

అయితే తాజాగా ఈ సినిమా నుండి మరో సాంగ్ ప్రోమో రిలీజ్ చేసారు. ఇక ఈ సాంగ్ మలయాళంలో ఉంది. కావున కొంత మంది తెలుగు ఆడియన్స్ కి అర్ధం కావడంలేదు. ఇందుకుగాను దీని గురించి అల్లు అర్జున్ ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ పాట యొక్క తెలుగు అర్ధాన్ని తెలిపారు.


ఇది కామదేవుని బాణమా, లేదా నీ కంటి బాణమా?
ఇవి మొదటి చంద్ర కిరణాలా, లేక సీతాకోకచిలుక నవ్వులా?
ఇవి అందమైన మల్లెపూల మూరలా, లేదా నీ అందమైన పెదావులా?
ఇవి తేనె కోసం వెతుకుతున్న తేనెటీగలా, లేక నీ కోరికల ముక్కలా?
అని దాని అర్ధాన్ని తెలిపారు ఐకాన్ స్టార్. దీంతో ఆయన చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.