Game Changer : అప్పుడే గేమ్ ఛేంజర్ నాలుగో సాంగ్.. ట్రైలర్ కూడా..అప్పుడేనా..
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ సినిమా గేమ్ ఛేంజర్. 2025 జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కావడానికి రెడీగా ఉంది.

Thats when the fourth single and trailer of Ram Charan Game Changer movie
Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ సినిమా గేమ్ ఛేంజర్. 2025 జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కావడానికి రెడీగా ఉంది. ఇక ఈ సినిమాలో కియారా హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే అంజలి, నవీన్ చంద్ర, సునీల్, శ్రీకాంత్, బాలీవుడ్ యాక్టర్ హ్యారీ జోష్, ఎస్‌జే సూర్య, సముద్రఖని, కన్నడ నటుడు జయరామ్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
Also Read : Naga Chaitanya-Sobhita : ‘శోభితను మొదట కలిసింది అక్కడే’.. టాప్ సీక్రెట్ రివీల్ చేసిన నాగచైతన్య
అయితే తాజాగా ఈ సినిమా నుండి మూడో పాట రీలీజ్ చేశారు మేకర్స్. నానా హైరానా ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ కలర్‌ఫుల్‌గా సాగుతూ అద్భుతమైన రెస్పాన్స్ కనబరుస్తుంది. యూట్యూబ్ లో దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ చేసిన రా మచ్చ, జరగండి జరగండి సాంగ్స్ కూడా మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఇదిలాఉంటే ఈ సినిమా నుండి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది.
అదేంటంటే.. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ నుండి నాలుగో సింగిల్ డిసెంబర్ రెండోవారంలో రానున్నట్టు తెలుస్తుంది. జనవరి మొదటివారంలో ట్రైలర్‌ను లాంచ్ చేయనున్నట్టు సమాచారం. అయితే నాలుగో సింగిల్ రాంచరణ్, అంజలి కాంబినేషన్‌లో మెలోడీ సాంగ్ అని అంటున్నారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో ఈ సాంగ్ ఉంటుందట. ఇక దీనికి సంబందించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.