Sukumar – Pushpa 2 : తీవ్ర జ్వరంతో సుకుమార్.. షూటింగ్ ఆగిన పుష్ప 2..

తాజా సమాచారం ప్రకారం పుష్ప 2 షూటింగ్ ఆగిందట.

Allu Arjun Pushpa 2 Shooting in Hold due to Sukumar High Fever

Sukumar – Pushpa 2 : అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ చివరి దశలో ఉంది. క్లైమాక్స్ షూట్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. డిసెంబర్ 6 రిలీజ్ ఉండటంతో శరవేగంగా సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇంకా పోస్టు ప్రొడక్షన్ వర్క్ కూడా ఉంది. నిన్నే పుష్ప 2 నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ నవంబర్ కి మొత్తం సినిమా రెడీ అవుతుందని తెలిపారు. మిగిలిన రెండు పాటలు సెప్టెంబర్ లో ఒకటి, అక్టోబర్ లో ఒకటి రిలీజ్ చేస్తామని తెలిపారు.

అయితే తాజా సమాచారం ప్రకారం పుష్ప 2 షూటింగ్ ఆగిందట. డైరెక్టర్ సుకుమార్ తీవ్ర జ్వరంతో బాధపడుతుండటంతో షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారట. ప్రస్తుతం సుకుమార్ చికిత్స తీసుకొని ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారని తెలుస్తుంది. మళ్ళీ సెప్టెంబర్ 3 నుంచి మిగిలిన షూట్ మొదలుపెడతారని టాలీవుడ్ టాక్.

Also Read : Chiranjeevi First Car : చిరంజీవి ఫస్ట్ కార్ ఏంటో తెలుసా? నిర్మాత ఇస్తానని ఇవ్వకపోవడంతో..

ఇప్పటికే పుష్ప 2 సినిమా మళ్ళీ వాయిదా పడుతుందని వార్తలు వస్తుండగా సుకుమార్ జ్వరం వార్తతో బన్నీ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. సుకుమార్ త్వరగా కోలుకొని సినిమా ఫాస్ట్ గా పూర్తిచేయాలని, ఎట్టి పరిస్థితుల్లోను డిసెంబర్ 6న రిలీజ్ చేయాలని కోరుకుంటున్నారు అభిమానులు.

ట్రెండింగ్ వార్తలు