Allu Arjun : ఏపీ హైకోర్టులో అల్లు అర్జున్ పిటిషన్.. నంద్యాల ఇష్యూకి సంబంధించి..

తాజాగా అల్లు అర్జున్ ఏపీ హైకోర్టు ని ఆశ్రయించారు.

Allu Arjun quash petition in AP High Court regarding Nandyala Issue

Allu Arjun : అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా వర్క్స్ తో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా అల్లు అర్జున్ ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. గతంలో ఏపీ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి సపోర్ట్ గా నంద్యాలలో ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ ప్రచారంపై అల్లు అర్జున్ 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉండగా అనుమతి లేకుండానే భారీగా జన సమీకరణ చేసారని కేసు పెట్టారు.

Also Read : Unstoppable Season 4 : సీఎం చంద్ర‌బాబు కోసం కూర‌గాయ‌ల షాప్ సెట్ వేసిన బాల‌య్య‌.. త్వ‌ర‌లో ఆహాలో అన్‌స్టాప‌బుల్

ఆ ప్రచారంపై పోలీస్ కేసు నమోదయింది. దీనిపై తాజాగా అల్లు అర్జున్ ఏపీ హైకోర్టు ని ఆశ్రయించారు. ఏపీ హైకోర్టులో అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల సమయంలో తనపై నంద్యాలలో నమోదైన కేసును కొట్టేయాలని క్వాష్ పిటిషన్ వేశారు. దీనిపై న్యాయస్థానం రేపు విచారించే అవకాశం ఉంది.